Health

ఈ ల‌డ్డు‌లు రోజుకు ఒకటి తింటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.. నేరుగా వీటిని తినడానికి కొంత మంది ఇష్టపడరు.. ఇలా డ్రైఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు ప్రోటీన్స్ అందుతాయి. అయితే బాదం పప్పులు.. బాదంపప్పులకు డ్రై ఫ్రూట్స్ రాజుగా పేరుంది. బాదం గింజల్లో ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఫైబర్, జింక్, విటమిన్ ఇ.. వంటివి సమృద్దిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త ప్రసరణను, హిమోగ్లోబిన్ స్థాయులను మెరుగుపరుస్తాయి.

శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ స్థాయులను బాదం నియంత్రిస్తుంది. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు చలికాలంలో శరీరం వేడిని కోల్పోకుండా చూస్తాయి. జీడిపప్పు.. జీడిపప్పుకు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించే శక్తి ఉంటుంది. మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనానికి ఇది సహాయపడుతుంది. జీడిపప్పు నుంచి తీసే నూనె ను చర్మ సమస్యలకు నివారిగా వాడుకోవచ్చు. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారటం, కాలి మడమల పగుళ్లు వంటి సమస్యలను దూరం చేస్తూ… చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జీడిపప్పు నుంచి విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది.

దీంట్లో ఉండే పోషకాలు వయసుతో పాటు వచ్చే సమస్యలను దూరం చేస్తాయి. అక్రోట్లు..శీతాకాలంలో అక్రోట్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇవి చలి ప్రభావాన్ని తగ్గిస్తూ, చర్మం వేడిని కోల్పోకుండా కాపాడుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఈ సీజన్‌లో ఉండే పొడి వాతావరణం వల్ల ఎదురయ్యే జుట్లు, చర్మ సమస్యలను అక్రోట్లు దూరం చేస్తాయి. అంజీర్.. అంజీర్‌ ద్వారా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుటాయి.

విటమిన్ ఎ, బి 1, బి 12, ఐరన్, మాంగనీస్, కాల్షియం, సోడియం, భాస్వరం, క్లోరిన్, పొటాషియం.. వంటి సూక్ష్మ పోషకాలకు అంజీర్‌ నిలయంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను నియంత్రిస్తూ డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. పిస్తా.. పిస్తాను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇవి హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఫ్రీ రాడికల్, వృద్ధాప్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తాయి. శీతాకాలంలో అతినీలలోహిత కిరణాలు మరింత శక్తిమంతంగా ఉంటాయి. వీటి ప్రభావాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker