ఈ మొక్క బంగారం కంటే విలువైనది, మగవారు ఈ ఆకులు ఒక్కసారి తిన్నారంటే..?
పిండి కూర ఆకును మనం పల్లెటూళ్లలో చాలాసార్లు చూశాం. దీనిని పాషాణభేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని దీని అర్థం. కొండపిండి చెట్టు అని, తెలగ పిండి చెట్టు అని కూడా పిలుస్తారు. అయితే పూర్వకాలంలో ఈ మందులు లేని రోజుల్లో మన పూర్వీకులు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని మొక్కలను ఉపయోగించి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసేవారు.
ఇప్పటికీ ఎంతోమంది ఆయుర్వేద నిపుణులు ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని మొక్కలు, వాటి ఆకుల ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తున్నారు. ఇలా ఆయుర్వేద గుణాలు ఉన్న మొక్కలలో కొండపిండి మొక్క కూడా ఒకటి. ఒక్క మొక్కతో ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. సాధారణంగా ఈ రోజుల్లో అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం. చిన్న పెద్ద అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య వేధిస్తోంది.
ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి చాలామంది సర్జరీలు చేయించుకోవడం, మందులు వాడటం వంటివి చేస్తున్నారు. అయితే కొండపిండి మొక్కను ఉపయోగించి కిడ్నీలో రాళ్ల సమస్యను సులభంగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొండపిండి మొక్క ఆకులను శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ ఆకులు లభించకపోతే ఆయుర్వేద దుకాణాలలో ఈ ఆకుల పొడి కూడా దొరుకుతుంది.
ఇలా కొండపిండి ఆకులు మరిగించిన నీటిని లేదా వేడి నీటిలో ఒక చెంచా కొండ పిండి ఆకుల పొడి వేసుకొని 20 రోజులపాటు తాగటం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈరోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు ఈ ఆకులను మెత్తగా రుబ్బి ఆ పేస్ట్ ని నుదుటిమీద పట్టీల వేసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
మగవారిలో అంగస్తంభన సమస్యతో బాధపడేవారు కొండపిండి ఆకులను మెత్తగా రుబ్బి వాటి నుండి రసం తీసి ఆ రసంలో జీలకర్ర చూర్ణాన్ని కలిపి తాగటం వల్ల అంగశూల సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా కొండపిండి ఆకుతో పప్పు తయారు చేసుకొని తినటం వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.