ఈ అలవాట్లు ఉంటే మీకు తొందరలోనే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
షుగర్ ఉన్నవారికి ప్రాణాంతక దుష్ప్రభావాలలో డయాబెటిస్ కీటోయాసిడోసిస్ ఒకటి. రక్తంలో చక్కెరను శక్తిగా ఉపయోగించడం కోసం మీ కణాలలోకి అనుమతించేందుకు శరీరంలో తగినంత ఇన్సులిన్ లేనప్పుడు ఈ మధుమేహం సంక్లిష్టత ఏర్పడుతుంది. అయితే నేటి రోజుల్లో ప్రజల జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. వీటిలో మధుమేహం ఒకటి. దేశంలో లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అయితే కొన్ని రోజువారీ అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మందికి వీటిపై అవగాహన లేదు. నిద్ర లేకపోవడం రాత్రిపూట తగినంత నిద్రపోకపోతే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
అందువల్ల కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి ఒత్తిడికి మధుమేహానికి నేరుగా సంబంధం లేదని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా ఒక కారణంగా చెప్పవచ్చు. నిజానికి ఒత్తిడి కారణంగా శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక కార్టిసాల్ రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఈ విధంగా డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యం చాలా మందికి ధూమపానం, మద్యం సేవించే అలవాటు ఉంటుంది.
ఇవి నేరుగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహానికి సంబంధించినవి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం కొవ్వుగా మారి మధుమేహం సమస్య పెరుగుతుంది. జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది జంగ్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. ఈ అలవాటు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మార్చడానికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజే ఈ అలవాట్లని వదిలేయండి.