ఈ డ్రింక్ తాగితే వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా అందంగా కనిపిస్తారు.
వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి కాఫీ, కొకొవా డ్రింక్స్ ఔషదంగా ఉపయోగపడతాయని నిపుణులు చెపుతున్నారు. న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు 10 సంవత్సరాల పాటు దాదాపు 850 మంది పైన పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తినడమే కాకుండా,ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తుంటాము.
అయితే వయసు పైబడినట్లు కనిపించకుండా వృద్ధాప్య ఛాయలు మన దరికి చేరకుండా ఉండాలంటే ఈ పాలు తాగడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే వృద్ధాప్య ఛాయలు దరికి చేరకుండా ఉండడం కోసం కష్టపడుతుంటారు అలాంటి వారు కొవ్వు శాతం తక్కువగా ఉన్నటువంటి టోన్డ్ పాలు తాగాలని సూచిస్తున్నారు. 5,834 మంది యుక్త వయస్కులపై కొన్నేళ్ల అధ్యయనం చేసిన అనంతరం నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ అధ్యయనం అనంతరం కొవ్వు శాతం అధికంగా ఉన్నటువంటి పాలు తాగిన వారి కన్నా తక్కువ కొవ్వు శాతం కలిగి ఉన్నటువంటి టోన్డ్ పాలు తాగేవారు ఎంతో యవ్వనంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. టోన్డ్ పాలు తాగే వారిలో వారి సరైన వయసు కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నగా ఉన్న వ్యక్తులలో కనిపిస్తున్నారని నిపుణులు తెలిపారు. సాధారణంగా కణ విభజన జరిగినప్పుడు… టెలోమెర్ల పొడవు తగ్గిపోతుందని ఈ క్రమంలోనే తొందరగా వృద్ధాప్య ఛాయలు కనపడుతూ ఉంటాయని తెలిపారు.
ఎవరైతే కొవ్వు శాతం తక్కువగా కలిగినటువంటి టోన్డ్ పాలు తాగుతారో వారిలో టెలోమెర్ల పరిమాణం తగ్గే వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల వీరీలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఆలస్యం అవుతుందని ఈ పరిశోధనలో భాగంగా నిపుణులు వెల్లడించారు.ఇలా నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఇలాంటి పాలు తాగితే వృద్ధాప్య ఛాయలు కనిపించవని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు.