ఈ నూనెతో ఇలా మస్సాజ్ చేస్తే కీళ్ళనొప్పులు వెంటనే తగ్గిపోతాయి
నొప్పి ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది. ఆర్థరైటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణం జాయింటుల్లో నొప్పి. అయితే కాళ్లు, పాదాల మాలిష్ కోసం చాలా రకాల ఆయిల్స్ వినియోగిస్తుంటారు. కానీ ఆవాల నూనెతో పాదాలు మాలిష్ చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి.
పాదాలు అందంగా మారడమే కాకుండా..ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. ఒకవేళ మీరు నిద్ర సమస్యతో బాధపడుతుంటే..ఆవాల నూనెను పాదాలకు మాలిష్ చేయండి. 5-10 నిమిషాల మాలిష్ అనంతరం నిద్ర సమస్య దూరం కావడమే కాకుండా..నిద్రలేమితో ఎదురయ్యే సమస్యల్నించి కూడా ఉపశమనం పొందవచ్చు.
ఒకవేళ మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతుంటే..ఆవాల నూనెతో మాలిష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరం కావడమే కాకుండా..ఆందోళన కూడా పోతుంది. ఆావాల నూనెతో కాళ్లకు మస్సాజ్ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతోపాటు మొత్తం శరీరానికి రక్త సరఫరా బాగుంటుంది.
కాళ్ల నొప్పులు వంటి సమస్యలుంటే క్రమం తప్పకుండా రోజూ నిద్రపోయే ముందు 5-10 నిమిషాలు ఆవాల నూనెతో మాలిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా లాభాలుంటాయి. కుదించుకుపోయిన రక్త నాళాలు, బ్లాకేజెస్‌ను సరి చేసేందుకు ఆవాల నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మాలిష్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.