ఈ ఒక్క టీ తాగితే బీపీ, షుగర్ రెండూ తగ్గిపోతాయి.
సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. ఈ రకమైన ఆరోగ్య లాభాలే కాకుండా, సోంపు గింజలను అనేక మందుల తయారీలో భాగంగా మరియు వంటల్లో కూడా తరచూ వాడుతుంటారు. అయితే మంచి విందు భోజనం తర్వాత ఒక చెంచా సోంఫ్ వేసుకొని నములుతుంటే ఆనందంగా ఉంటుంది.
అయితే సోంఫులో పొటాషియం, మాంగనీస్, జింక్, ఐరన్, రాగి వంటి మినరల్స్ ఉంటాయి. ఇంకా ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచడం ద్వారా ఎసిడిటీ, శరీర దుర్వాసన, నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు, సోంఫు విత్తనాలతో టీ చేసుకొని తాగితే జలుబు, దగ్గు లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.
ప్రతిరోజూ పరిమిత మోతాదులో ఫెన్నెల్ టీ తాగటం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం..గోరువెచ్చని ఫెన్నెల్ టీ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తిమ్మిరిగా ఉన్నప్పుడు ఒక కప్పు ఫెన్నెల్ టీని త్రాగవచ్చు. ఇంకా ఈ ఫెన్నెల్ టీలో ఉండే మెగ్నీషియం కారణంగా, ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది, నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది.
అధిక రక్తపోటు నియంత్రణకు..అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఫెన్నెల్ టీ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీలోని పోషక గుణాలు హైబీపీని తగ్గించగలవు. కొన్ని అధ్యయనాలు ప్రకారం, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ఉండదు..వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఫెన్నెల్ టీ చాలా సహాయపడుతుంది. సోంఫులో ఉండే కూలింగ్ ఏజెంట్లు, హైడ్రేటింగ్ గుణాలు మీ శరీరాన్ని చల్లగా అలాగే హైడ్రేట్ గా ఉంచుతాయి.