ఈ కాలంలో నగ్నంగా నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న సమస్య నిద్రలేమి. ఇందుకు కొన్ని అనారోగ్య కారణాలే కాకుండా.. అతిగా టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం కూడా నిద్రలేమి సమస్యలకు కారణమవుతోంది. నిద్రలేమి నుంచి బయటపడేందుకు చాలామంది మాత్రలను వాడుతున్నారు. అయితే నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందట.. నైట్ పైజామాలు, సాక్సుల వంటివి రక్త ప్రసరణకు కొద్ది మొత్తంలో అడ్డంకులు ఏర్పరచవచ్చు.
మంచి రక్త ప్రసరణ గుండె, కండరాల ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు నగ్నంగా నిద్రించడం బాడీ టెంపరేచర్‌ను కూడా రెగ్యులేట్ చేస్తుందట. ఫ్లూ లేదా జలుబు వంటివి ఉన్నపుడు తప్పనిసరిగా బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బాడీ టెంపరేచర్ రేగ్యులేట్ చేయడం అవసరం కూడా. స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇలా నిద్రించడం ఆరోగ్యకరం అని డాక్టర్ హాల్ అంటున్నారు. నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నగ్నంగా నిద్రించడం వల్ల పురుషుల్లో ఫెర్టిలిటి పెరుగుతుందట.
స్త్రీలలో అసౌకర్యంగా ఉండే లోదుస్తుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల బెడద ఉండదట. దుస్తులు లేకపోవడం వల్ల స్కిన్ ఆన్ స్కిన్ కాంటాక్ట్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందని డాక్టర్ హాల్ అంటున్నారు. సీసనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(SAD) అనే మానసిక స్థితి కూడా ఏర్పడదు అనేది కూడా నిపుణుల అభిప్రాయం. సంవత్సరంలో మిగతా అన్ని సీజన్లలో మామూలుగానే ఉండే వ్యక్తులు సాడ్ వల్ల ఒక పర్టిక్యులర్ కాలంలో డిప్రెషన్‌కు లోనవుతారు. సాధారణంగా ఇది ప్రతి సంవత్సరం ఒకే కాలంలో వస్తుంది.
చలికాలంలో ఇలాంటి సమస్యలు రావచ్చు కొందరిలో ఈ సమస్యలో నీరసంతో పాటు డిప్రెషన్‌తో బాధ పడుతుంటారు. ఈ స్థితి నుంచి బయటపడేందుకు స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ బాగా ఉపకరిస్తుందని డాక్టర్ల అభిప్రాయం. అయితే నగ్నంగా పడుకున్నపుడు బెడ్ షీట్స్ మీద మామూలు కంటే ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. అందుకని తరచుగా బెడ్ షీట్స్ మార్చడం అవసరం అవుతుంది. అయితే మీ సొంత బెడ్ మీద పడుకున్నపుడు మాత్రమే ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల లాభాలు ఉంటాయి. కానీ హోటల్ రూముల్లో లేక, ఇంకెక్కడైనా పడుకుంటే మాత్రం తప్పనిసరిగా మీ పైజామాలో మీరు పడుకోవడం మంచిది.