Health

Thyroid: ఇలా చేస్తే మీకు జీవితంలో థైరాయిడ్ సమస్య అసలు రాదు.

Thyroid: ఇలా చేస్తే మీకు జీవితంలో థైరాయిడ్ సమస్య అసలు రాదు.

Thyroid: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత పరిమాణంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే అత్యంత సాధారణ థైరాయిడ్ రుగ్మత. అయితే థైరాయిడ్ అనేది మన గొంతులో ఉండే గ్రంధి అని, దీని నుంచి శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని మీకు తెలిసే ఉంటుంది. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా లేదంటే చాలా తక్కువగా ఉన్నా సరే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ థైరాయిడ్ అనే వ్యాధికి చికిత్స లేదు. అయితే మందులతో పాటు జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

Also Read: మూత్రం వాసనా వస్తుందా..!

థైరాయిడ్‌కు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకప్పుడు సాంప్రదాయ వంటకాలు మాత్రమే తినేవారు. ఇప్పుడు మొత్తం మాడ్రన్ అన్నట్టుగా మారాయి ఆహారపు అలవాట్లు. బేకరీ ఐటమ్స్, డోమినోస్, రెస్టారెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు ఈ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి, థైరాయిడ్‌తో బాధపడేవారు ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు చాలా కాలం సేపు నిండుగా ఉంటుంది. మాటి మాటికి తినాలి అనే కోరిక ఉండదు. అలాగే గట్ ఫ్రెండ్లీ డైట్ తీసుకోవాలి.

థైరాయిడ్‌ను నియంత్రించడానికి, రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చడం చాలా ముఖ్యం. యోగా, వ్యాయామం లేదా నడక ద్వారా థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి. శారీరక శ్రమ శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో శారీరక శ్రమను కచ్చితంగా భాగం చేసుకోవాలి. ఒత్తిడి కూడా థైరాయిడ్‌కు కారణం. అధిక ఒత్తిడి కారణంగా జీవక్రియ తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి. మనశ్శాంతి కోసం, ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేయండి. వీటి వల్ల మీకు మరింత ఉపశమనం పొందుతుంది.

Also Read: ఈ కాలంలోనే ఎక్కువ మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.

థైరాయిడ్ కు మాత్రమే కాదు మీ శరీరానికి కూల్ ఫీలింగ్ ను అందిస్తుంది యోగా. థైరాయిడ్‌ను నియంత్రించడానికి తగినంత నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. తక్కువ నిద్ర తీసుకోవడం వల్ల అలసట, శక్తి వస్తుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్రను తీసుకోవడం చాలా ముఖ్యం. నిద్ర ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఈ నిద్ర తక్కువ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. లేదంటే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త పడటం ముఖ్యం అంటున్నారు నిపుణులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker