పదే పదే కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా..? భవిష్యత్తులో రోగాలు రావచ్చు.
సూదులతో గుచ్చినట్టు, జివ్వుమని లాగేస్తున్నట్టు విచిత్రమైన బాధను కలిగి ఉంటాయి తిమ్మిర్లు. ఎక్కువ సేపు కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చున్నప్పుడు కాళ్లు తిమ్మిరి ఎక్కుతాయి. లేచి అటూ ఇటూ నాలుగు అడుగులు వేయడంతో తిమ్మిర్లు తగ్గిపోతుంది. ఇలా జరగడం సర్వసాధారణం. అయితే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, అది మీ ధమనుల్లో చేరడం ప్రారంభమవుతంది. దీంతో కొన్ని శారీరక లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా కాళ్ళలో కొన్ని లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు. చికిత్స తీసుకోకుంటే హై కొలెస్ట్రాల్ ధమనులలో ఫలకం ఏర్పడేందుకు దారితీస్తుంది. సంకోచించిన రక్తనాళాలు శరీర భాగాలకు రక్త ప్రవహానికి అంతరాయం కలిగిస్తాయి. ఈ పరిస్ధితిని కాళ్లలో గుర్తించవచ్చు. దీనిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి మొదటి లక్షణం. దీనివల్ల ఆకస్మిక కండరాల సంకోచం కారణంగా వస్తాయి. దీని వల్ల ఇబ్బందిగా, బాధ కలుగుతుంది. కండరాలను బిగించినట్లు అనిపిస్తుంది. కాలు కండరాలలో నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది.
చురుకుగా ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు సాధారణంగా ఉంటుంది. ఇది సాధారణంగా రక్త ప్రవాహ సమస్యల వల్ల వస్తుంది. ఫలకం అడ్డుపడటంవల్ల వస్తుంది. కాళ్ళలో నొప్పి, అసౌకర్యం అనేక కారణాల వల్ల ఎక్కువ అవుతుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఏదైనా పనిచేసినప్పుడు వస్తుంది. అప్పడప్పుడు తిమ్మిరి, బలహీనంగా, బరువు, అలసిపోయినట్లుగా ఉంటుంది. ఈ తరహా నొప్పి తొడలు, పిరుదుల్లో కూడా వస్తుంది. నొప్పి శారీరక పనుల్లో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాళ్ళ నొప్పులు, తిమ్మిరి కాకుండా,విశ్రాంతి తీసుకునేటప్పుడు పాదాలు, కాలి వేళ్ళలో మంట, నొప్పికి దారి తీస్తుంది.
ముఖ్యంగా రాత్రి సమయంలో సమాంతరంగా పడుకున్నప్పుడు ఇతర లక్షణాలు పాదాలపై చర్మం చల్లగా మారడం, ఎరుపు రంగులోకి మారడం, చర్మం ఇతర రంగు మార్పులు, ఇన్ఫెక్షన్లు, పాదాల పుండ్లు వస్తాయి. రక్తపరీక్షల ద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించవచ్చు. ఇది ఉత్తమమైన మార్గం. పరీక్షల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లైతే ఆహారం నుండి సంతృప్త కొవ్వును తగ్గించడం, స్టాటిన్స్ అనే మెడిసిన్ తీసుకోవడం వంటి అవసరమైన చర్యల కోసం వైద్యులను సంప్రదించటం మంచిది.