కాలినడకన తిరుమల కొండెక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కోసమే అంటూ..!
త్రివిక్రమ్ సడెన్ గా ఇలా తిరుమల శ్రీవారిని కాలినడకన వచ్చి దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఆయన తన సినిమా రిలీజ్ సమయంలో కానీ, సినిమా సక్సెస్ అయ్యాక కానీ తిరుమలకు వస్తుంటాడు. కానీ ఈసారి అవేం లేకుండా రావడంతో దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీవారి మెట్ల మార్గంలో త్రివిక్రమ్ కుటుంబ సభ్యులు కాలినడకన వెళుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉదయం VIP దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా త్రివిక్రమ్ సతీమణి సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కుమారుడు కూడా తాజా వీడియోలో కనిపించాడు. రిషి మంచి హైట్, కళ్లజోడు పెట్టుకుని అచ్చం నాన్నలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. త్రివిక్రమ్ కుమారుడు హీరోలా ఉన్నాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనూహ్యంగా తిరుమల శ్రీవారి పర్యటన చేపట్టడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తన క్లోజ్ ఫ్రెండ్ పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందునే త్రివిక్రమ్ కాలి నడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోనున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అదేమీ కాదని సమ్మర్ పూర్తవుతుంది కాబట్టే క్యాజువల్ గానే త్రివిక్రమ్ తిరుమల శ్రీవారి దర్శించుకోనున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చారు త్రివిక్రమ్.
మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ యూట్యూబ్ రికార్డులు కొల్ల గొట్టింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు #Trivikram
— Gulte (@GulteOfficial) June 17, 2024
శ్రీవారి మెట్టు కాలిబాట గుండా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్… pic.twitter.com/mnUuWyhejM