అవును, చాలా మందితో డేటింగ్ చేశాను, ఓపెన్ గా చెప్పేసిన త్రిష. షాక్ లో ఫాన్స్.
రెండు నెలల కిందట త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించి, అది లేకపోవడంతో నిరాశ చెందానని మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే త్రిష ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు దక్కించుకుంటుంది. మరోవైపు త్రిష పలు వివాదాల్లో చిక్కుకుంది. త్రిష టార్గెట్ గా కొందరు అనుచిత కామెంట్స్ చేశారు.
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు… త్రిషపై దారుణ ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ అయిన త్రిష లీగల్ యాక్షన్ తీసుకుంది. ఏవీ రాజుకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అలాగే నటుడు మన్సూర్ అలీ ఖాన్… లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించాను. కనీసం నాకు ఆమెను నాకు చూపించలేదని చీప్ కామెంట్స్ చేశాడు. ఈ వివాదంలో కూడా త్రిషకు పరిశ్రమ అండగా నిలిచింది. ఇదిలా ఉండగా… తాను పలువురితో డేటింగ్ చేశాను.
రిలేషన్ పెట్టుకున్నానంటూ త్రిష స్వయంగా చెప్పడం చర్చకు దారి తీసింది. త్రిష మాట్లాడుతూ… నేను పలువురితో డేటింగ్ చేశాను. రిలేషన్ పెట్టుకున్నాను. అయితే ఒక్కరితో కూడా వర్క్ అవుట్ కాలేదు. భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీవించలేము. ఒక దశలో పెళ్లి నాకు సెట్ కాదు అనిపించింది. ఈ వయసులో నన్ను నేను ప్రేమించుకోవడం ముఖ్యం. సెల్ఫ్ లవ్ చాలా బాగుంటుంది. ఒకరి కోసం మనం బ్రతకడం కంటే, మన కోసం మనం బ్రతకడం మంచిది… అని చెప్పుకొచ్చారు.
త్రిష-దగ్గుబాటి రానా మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. అలాగే ధనుష్ తో త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి. సూచి లీక్స్ లో రానా, ధనుష్ లతో త్రిష ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఆమె శింబుతో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2015లో త్రిష బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం త్రిష చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రం చేస్తుంది.