News

రాజమౌళి సినిమా చెయ్యనని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్, ఎందుకు నో చెప్పిందంటే..?

బయటకు చెప్పారు కానీ రాజమౌళి సినిమా ప్లాప్ కావాలని చాల మంది కోరుకుంటున్నారా.? అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఈ మాట అంటుంది మరెవరో కాదు సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే రాజమౌళి సినిమా ప్లాప్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకోవడం లేదంట. అయితే రాజమౌళితో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరు అనుకుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలు అని ఎదురుచూస్తూ ఉంటారు.

కానీ ఓ హీరోయిన్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. రాజమౌళి స్వయంగా పిలిచి మరి హీరోయిన్ గా అవకాశం ఇస్తే.. ఆ అమ్మడు సింపుల్ గా రిజక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు చెన్నై చిన్నది త్రిష. ఈ ముద్దుగుమ్మ జక్కన్న ఆఫర్స్‌ను రిజెక్ట్ చేసిందట. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన సినిమా మర్యాద రామన్న ఈ సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ అనుకున్నారట రాజమౌళి.

అయితే అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్.. తన సినిమాలో కమెడియన్‌గా నటించిన సునీల్ కు జోడిగా నటించడానికి ఆమె సంకోచిందట. స్టార్ దర్శకుడు అయినప్పటికీ సునీల్ సరసన అనేసరికి త్రిష ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దాంతో రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్స్ కాకుండా కొత్త హీరోయిన్స్ ను వెతకడం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే సలోనిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.

మర్యాద రామన్న సినిమా తర్వాత సలోనికి పెద్దగా సినిమా ఛాన్స్ లు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది. ఇక త్రిష విషయానికొస్తే ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ్ లో బిజీగా మారిపోయింది. అలాగే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker