ఈ తులసి టీ తాగితే శ్వాసకోశ రుగ్మతలు వెంటనే తొలగిపోతాయి.
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడడంలో సహాయపడుతోంది. తులసిని ఏ విధంగా తీసుకున్నా అది మనకు చాలా మేలు చేస్తోంది. తులసి ఆకులను నేరుగా తినవచ్చే. అలాగే తులసి ఆకులతో టీని కూడా చేసుకొని తాగవచ్చు. అయితే అతి పవిత్రంగా భావించే మొక్కలలో తులసి మొక్క ముందు వరుసలో ఉంటుంది. ఇది పవిత్రమైన మొక్క మాత్రమే కాదు ఆరోగ్యప్రదాయిని కూడా. ఔషధాల తయారీలో తులసి ఆకులు, కాండం, మొక్క విత్తనాల కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
తులసిలో అడాప్టోజెనిక్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. తులసి టీ తయారు చేయడం ఎలా..6-7 తాజా తులసి ఆకులు, 1 అల్లం ముక్క, 2 టీస్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 పచ్చి ఏలకులు, 2 1/2 కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా నీటిని మరిగించాలి. ఆ తరువాత ఆకులతో సహా అన్నింటినీ మరిగే నీటిలో యాడ్ చేయాలి. 2-3 నిమిషాలు పాటు వీటిని మరిగించాలి. ఆపై స్టవ్ కట్టేసి తులసి టీని తాగవచ్చు. గమనిక.. అధిక రక్తస్రావం, విపరీతమైన ఆకలి, నొప్పితో బాధపడేవారు తులసి టీ తాగాక పోవడమే శ్రేయస్కరం. తులసి టీ ప్రయోజనాలు.. డిప్రెషన్, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు చెక్ తులసి టీ ఒక యాంటీ-స్ట్రెస్ డ్రెస్ లాగా పనిచేస్తుంది.
డైలీ ఈ టీ తాగడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. ఇందులో లభించే పొటాషియం అనేది మెదడులోని సెరోటినిన్ లెవల్స్ పెంచుతుంది. తద్వారా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. ఈ టీ సువాసన కూడా మనసుకు చాలా ప్రశాంతతను అందిస్తుంది. ఈ ఔషధ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయి. గుండె జబ్బులను కూడా దూరం చేస్తాయి. దంత, చర్మ, అంటు వ్యాధులు మాయం.. ఇందులోని యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఫంగల్ చర్మ వ్యాధులు తగ్గిస్తాయి. ఈ టీలోని ఒక పదార్థం దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. పాచి కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధుల రుగ్మతలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
శ్వాస, వైరల్ డిసీజ్‌లకు దివ్యౌషధం.. డైలీ ఒక కప్పు తులసి టీ తాగడం ద్వారా శ్వాసకోశ రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే ఇందులో ఉన్న యాంటీవైరల్ లక్షణాలు దగ్గు, జలుబు, వైరల్ జ్వరం తగ్గేందుకు బాగా సహాయపడుతాయి. సైనసైటిస్, తలనొప్పిని వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్యాలకు బెస్ట్ మెడిసిన్ తులసి టీ.. అనేక అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షించడంలో తులసి ఎంతో దోహదపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. చక్కటి నిద్రకు తులసి టీ..నిద్రలేమి అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. తులసి టీ నిద్రలేమికి శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తాగితే మత్తుమందు చేసుకున్న విధంగా నిద్రపడుతుంది. ఈ టీలోని స్టిమ్యులేటింగ్ గుణాలు మీ మనసును రిలాక్స్ చేసి గాఢనిద్రలోకి వెళ్లేలా చేస్తాయి.