ఈ అద్భుతమైన చిట్కాలతో టైప్ 2 డయాబెటిస్ తగ్గిపోతుంది.
మధుమేహం ఉన్నవారిలో దాదాపు 90% మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. సాధారణంగా జీవనశైలి మార్పులతో టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కొందరికి మందులు కూడా అవసరం కావచ్చు. అయితే ఇది బాధితుల ఆరోగ్యంపై ప్రభావం చూపేంత వరకు, వారికి టైప్ 2 డయాబెటిస్ ఉందని కూడా తెలియకపోవచ్చు. అయితే అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల చిన్న వయస్సు వారికి కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తోంది.
దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తమ జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొన్ని వేప ఆకులను అలాగే నమిలి మింగాలి. లేదా వేపాకుల రసం కూడా తాగవచ్చు.
దీంతో కొద్ది రోజుల్లోనే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే 1 నుంచి 6 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. దీని వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే మెంతులను అలాగే తినేయాలి.
లేదా రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను తినాలి. అదీ కుదరకపోతే మెంతి పొడిని నీటిలో కలుపుకుని తాగేయాలి. దీని వల్ల కూడా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే కాకరకాయ రసాన్ని తాగాలి. దీని వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుంది.