Health

అల్సర్ల తో బాధ పడుతున్నారా..? ఈ జాగర్తలు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది.

చెడు ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వీటిలో కడుపులో అల్సర్లు ఒకటి. ప్రస్తుతం చాలా మందిని కడుపు అల్సర్ల సమస్య వేధిస్తోంది. ఆల్కహాల్‌, స్మోకింగ్‌, కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, మసాలా ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపులో అర్సర్లు ఏర్పడతాయి. కడుపులో అల్సర్లు ఉంటే.. తీవ్రమైన మంట, కడుపు నొప్పి వేధిస్తుంటుంది. ఆహారం తిన్నా, తినకపోయినా.. కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకసారి అల్సర్‌ వస్తే అది మళ్లీ మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అల్సర్‌ వచ్చినవాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

అయితే చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువమంది బాధపడుతున్న వాటిలో స్టమక్ అల్సర్ కూడా ఒకటి. స్టమక్ కల్చర్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కామన్ గా ఇవి వస్తుంటాయి. పైగా ఎంతో నొప్పి కలుగుతూ ఉంటాయి. అయితే స్టమక్ అల్సర్ లకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అయినప్పటికీ ఇంటి చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. ఒకవేళ కనుక మీరు ఇంటి చిట్కాలు ని ప్రయత్నం చేయాలని అనుకుంటే వీటిని ప్రయత్నం చేయొచ్చు.

ప్రోబయోటిక్స్..ప్రోబయోటిక్స్ ని మీరు తీసుకోవడం వలన ఆస్తమా అలసర్ల నుండి బయటపడొచ్చు ప్రోబయోటిక్స్ ని తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో చక్కటి గుణాలు ఉంటాయి. సో వీటిని తీసుకోవడం వలన మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సప్లిమెంట్స్ ని కూడా మీరు తీసుకోవచ్చు. తేనే..ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇంఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ వంటి వాటి నుండి బయట పడేస్తుంది. అల్సర్ల నుండి బయటపడడానికి తేనే సహాయం చేస్తుంది. అలోవెరా..అలోవెరా కూడా ఈ సమస్య నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. చాలా స్టడీల ప్రకారం చూస్తే అలోవెరా స్టమక్ అల్సర్ల నుండి బయట పడేస్తుంది.

అల్లం..అల్లం కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది అజీర్తి సమస్యల్ని దూరం చేస్తుంది. అల్లం వలన చాలా రకాల లాభాలు ఉన్నాయి. అలానే వెల్లుల్లి పసుపు కూడా చక్కటి ప్రయోజనాలని ఇస్తాయి. అల్సర్ల తో బాధపడే వాళ్ళకి ఈ రెండు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్యాబేజీ జ్యూస్ ని కూడా మీరు తీసుకోవచ్చు. క్యాబేజీ జ్యూస్ కూడా అల్సర్ల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker