మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొంటే ఏం జరుగుతుందో తెలుసా..?
నీరు తాగుతూ, మూత్ర విసర్జన క్లియర్‌గా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. మూ త్రం వస్తున్నా కొన్నిసార్లు విసర్జనకు సదుపాయాలు లేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకొంటే ఇబ్బందేమీ ఉండదు. కానీ తరచూ ఆపుతుంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. అయితే మూత్ర విసర్జన అనేది ఒక సహజ ప్రక్రియ. కానీ బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్ళడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. కానీ మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం కుదరదు.
కానీ ఎక్కువ కాలం మూత్రాన్ని ఆపడం వల్ల 15 శాతం మందికి ప్రోస్టేట్, కిడ్నీల్లో రాళ్ళు, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి సమస్యలు ఉన్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది బలవంతంగా మూత్రాన్ని నియంత్రిస్తారు. కాని మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయంలో తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం సంచిలా కనిపిస్తుంది. అలాగే ఇది కిందికి జారిపోతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విడుదల కాదు.
కొన్నిసార్లైతే మూత్రాశయం కూడా పగిలిపోవచ్చు. ఇది మాత్రమే కాదు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపే వ్యక్తులు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. మూత్రాశయంలో ఎక్కువ కాలం మూత్రం పేరుకుపోయినప్పుడు.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా పెరుగుతుంది. ఇది కణితి రూపంలో కూడా ఉండే అవకాశం ఉంది. మూత్రాశయం ఎక్కువ సేపు మూత్రంతో నిండి ఉంటే.. మూత్రాశయం బలహీనంగా మారుతుంది. అలాగే దాని బయటి పొర పలుచగా మారుతుంది. గర్భిణులు మూత్రాన్ని ఆపడం కష్టమవుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
ఒకవేళ మూత్రాశయంతో మూత్రం నిండితే గర్భంలో ఒత్తిడి పెరుగుతుంది. 1 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రతి గంటకు మూత్ర విసర్జన చేయాలి. ఎందుకంటే నవజాత శిశువులకు మూత్రాశయం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్లు త్వరగా మూత్ర విసర్జన చేస్తారు. అయితే కాలక్రమేణా పిల్లలు రోజుకు 10 నుంచి 12 సార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికొస్తే.. వీల్లు రోజుకు 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజూ పుష్కలంగా నీటిని తీసుకోవాలి. మూత్రాశయం ఆరోగ్యంగా ఉండాలంటే..మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. మూత్రాన్ని అస్సలు ఆపుకోకూడదు.
ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేయాలి. పుష్కలంగా నీటిని తాగాలి. దీంతో మూత్రం ద్వారా బ్యాక్టీరియా కూడా శరీరం నుంచి బయటకు పోతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాలి. కటి వ్యాయామాలు చేస్తే కూడా మూత్రాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతాయి. శృంగారంలో పాల్గొన్న తర్వాత మీ ప్రైవేట్ భాగాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. టైట్ ఫిట్టింగ్ ప్యాంటును ధరించడం మానుకోండి. కాటన్ లోదుస్తులు మాత్రమే ధరించండి.