Urine: మూత్రం తాగితే ఈ రోగాలు నిజంగానే నయమవుతాయా..? ఆ నొప్పులు కూడా..!

Urine: మూత్రం తాగితే ఈ రోగాలు నిజంగానే నయమవుతాయా..? ఆ నొప్పులు కూడా..!
మూత్రం తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు అంటున్నారు. అవును.. మూత్రం తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలియజేసే అనేక నివేదికలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి మలబద్ధకం వరకు పలు రకాల వ్యాధులను మూత్రం దూరం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే మూత్రం తాగడం ఆరోగ్యానికి మంచిదని కొంతమంది నమ్ముతుంటారు. ముఖ్యంగా చైనాలో కొందరు తమ మూత్రాన్ని తామే తాగడం, కళ్లకు, ముఖానికి అప్లై చేయడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల ముఖం మెరుగు పడుతుందని, దృష్టి బాగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, మూత్రం తాగడం బరువు తగ్గించడంలో సహాయపడుతుందని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు.
Also Read: మన దేశంలో సగం మంది పురుషులు ఈ వ్యాధితో పదపడుతున్నారు.
మూత్రాన్ని టీలా తాగడం, కంటి చుక్కలాగా వాడటం వంటి పద్ధతులు ఉన్నాయి. ఈ విధానాన్ని యూరోథెరపీ లేదా యూరోఫాగియా అని పిలుస్తారు. ఇది ప్రాచీన కాలంలో రోమ్, ఈజిప్ట్, గ్రీస్ వంటి దేశాల్లో కొన్ని రకాల వ్యాధులకు ఉపయోగించేవారని చెబుతారు. అప్పట్లో కూడా మధుమేహం వంటి వ్యాధులను మూత్రం ద్వారా గుర్తించే ప్రయత్నాలు చేసేవారు.
Also Read: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు.
కానీ, ఈ విధానం మీద శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మూత్రం తాగడం వల్ల శరీరానికి మంచికన్నా ఎక్కువ హానికరమే. ఎందుకంటే మూత్రంలో బాక్టీరియా, టాక్సిన్లు, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇవి తిరిగి శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు.
Also Read: గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు మనిషిలో కనిపించే లక్షణాలు ఇవే.
ముఖ్యంగా కిడ్నీపై తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. మూత్రం ఎప్పటినుంచో ఔషధంగా వాడుతుండటమే నిజం. అయితే, ఈ విధానం ఇప్పుడు శాస్త్రీయంగా నిజం కాదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. అందువల్ల, మూత్రం తాగడం, అప్లై చేయడం వంటివాటిని blindly ఫాలో కావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.