Health

చుండ్రు స‌మ‌స్య వేధిస్తోందా..? ఈ నూనెని ఒక సారి ట్రై చేసి చుడండి.

డాండ్ర‌ఫ్ స‌మ‌స్య ఉన్న‌వాళ్ల‌కు చాలా చికాకుగా ఉంటుంది. త‌ర‌చూ త‌ల దుర‌ద‌పెడుతూ ఉంటుంది. బ‌య‌ట‌కివెళ్లిన‌ప్పుడు బ‌ట్ట‌ల‌పై డాండ్ర‌ఫ్‌ రాలి అసౌక‌ర్యంగా ఉంటుంది. అలాగే, చుండ్రును అశ్ర‌ద్ధ చేస్తే హెయిర్‌ఫాల్ అధికంగా అయి బట్ట‌త‌ల వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే చుండ్రు అనేది శిలీంధ్రాల ఇన్ఫెక్షన్, ఇది తలపై పొలుసులుగా కనిపిస్తుంది. చర్మంపై అదనపు నూనె రంద్రాలను మూసుకుపోయి మొటిమలను ఏర్పరచినట్లే, తలపై అదనపు నూనె చుండ్రుకు దారితీస్తుంది.

జుట్టుకు ఎక్కువ నూనె రాసుకుని ఎక్కువ సేపు అలాగే ఉంచితే తలపై మృతకణాలు పేరుకుపోతాయి. దాంతోనే జుట్టు కుదుళ్లలో నూనె పేరుకుపోయి చుండ్రుకు దారి తీస్తుంది. చుండ్రు అనేది స్కాల్ప్‌లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ లాంటిది.. కాబట్టి, ఆయిల్ నెత్తిమీద ఎక్కువ బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. అప్పుడు అది పొడిగా, పొరలుగా మారుతుంది. జిడ్డుగల స్కాల్ప్ బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి నూనెలలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి స్కాల్ప్‌పై బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. కాబట్టి, మీకు చుండ్రు ఉన్నప్పుడు మీ తలపై నూనె రాసుకోవడం వల్ల చుండ్రు మరింత తీవ్రమవుతుంది. చుండ్రు వల్ల స్కాల్ప్ వస్తుందని, నూనె రాస్తే నయమవుతుందని చెప్పడం తప్పైతే, చుండ్రుకు మందు ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. నిమ్మకాయ, కలబంద జెల్, మెంతి పేస్ట్ వంటివి చుండ్రు చికిత్సకు చక్కటి ఇంటి నివారణ చిట్కాలు. అదేవిధంగా, ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా నీటిలో కరిగిన బేకింగ్ సోడాతో మీ తల కడగడం వల్ల చుండ్రుని నివారించవచ్చు.

ఒక కప్పు అలోవెరా జెల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలిపి.. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే షాంపూతో తలను కడిగేస్తుంటే..చుండ్రు తగ్గుతుంది. అయితే, ఇక్కడ మీరు తలకు సున్నితమైన షాంపూని ఉపయోగించడం అతి ముఖ్యం. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తలకు పట్టించినా చుండ్రును తగ్గుతుంది. త్రిఫల చూర్ణం చుండ్రును పోగొట్టడంలో సహాయం చేస్తుంది. ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు పెరుగులో రాత్రంతా నానబెట్టి…. ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు పట్టించాలి. అరగంట ఉంచి కడిగేస్తే..చుండ్రు సమస్య తగ్గుతుంది.

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి.. ఆ మర్నాడు..వాటిని పేస్ట్ చేయాలి..ఇందులో కొద్దిగా అలోవెరా జెల్ కలుపుకుని తలకు అప్లై చేసి.. గంటసేపు అలాగే ఉంచి షాంపూతో కడగాలి. మీ జుట్టుకు సరిపోయేంత కొబ్బరి నూనె తీసుకుని.. ఓ పాత్రలో వేసి 1-2 నిమిషాలు వేడి చేయాలి. అందులో కొన్ని చుక్కలు నిమ్మరసం తలకు పట్టించి.. కొంచెం సేపు ఆగిన తర్వాత కడిగేయాలి. అయితే, చుండ్రు చికిత్సకు తలకు నూనె రాయడం పరిష్కారం కాదు. చుండ్రును నివారించడానికి తలపై మురికి, మృతకణాలు, అదనపు నూనె లేకుండా చూసుకోవాలి. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య పెరుగుతుందనేది నిజం. ఇది జుట్టు రాలడానికి, జుట్టు పోషణ, షైన్ కోల్పోవటానికి దారితీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker