ఈ నూనెతో చుండ్రు సమస్య తగ్గి మీ జుట్టు అందంగా తయారవుతుంది.
చాలా మందికి వింటర్ సీజన్ అంటే ఇష్టం అయినప్పటికీ.. ఈ సీజన్ మొదలవగానే చాలామందికి చుండ్రు సమస్య కూడా మొదలవుతుంది. దీనికి అతి పెద్ద కారణం పొడి గాలి. ఇది తలలో ఉండే తేమను లాగేస్తుంది. అంతేకాకుండా మలాసెజియా అనే ఫంగస్ శీతాకాలంలో గాలిలో ఉంటుంది. ఇది తలపై చుండ్రుకు కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా అధిక ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ చుండ్రు సమస్య రావొచ్చు.
అయితే చలికాలంలో చుండ్రు సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో జుట్టు పొడిబారడం వల్ల డ్రైగా మారుతుంది. అయితే ఆవనూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు మూలాలకు పోషణనిచ్చి, చుండ్రును పోగొట్టి, జుట్టు దృఢంగా అందంగా మారుస్తాయి. ఆముదంను జుట్టుకు చాలా రకాలుగా అప్లై చేయవచ్చు. వేప ఆకులతో.. ఆముదం, వేప ఆకులను కలిపి రాసుకుంటే చుండ్రు తొలగిపోతుంది.
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఆముదంలో ఉండే గుణాలు చర్మాన్ని తేమగా మారుస్తాయి. ఆవనూనెతో వేప ఆకుల పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టుకు మెరుపు వస్తుంది. కలబందతో కలబంద, ఆముదం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. అలోవెరా జెల్‌లో 2 టీస్పూన్ల ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత బాగా కడగాలి. ఈ పద్ధతిని నిరంతరం ఉపయోగిస్తే చుండ్రు కొన్ని రోజుల్లో పోతుంది.
హెన్నాతో.. హెన్నాతో ఆముదం మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చుండ్రు పోవడమే కాకుండా జుట్టు నల్లగా మారుతుంది. హెన్నాలో ఒక చెంచా ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 1 గంట తర్వాత కడిగేస్తే జుట్టు అందంగా కనిపిస్తుంది. కొబ్బరి నూనెతో.. కొబ్బరిలో ఆముదం కలిపి రాసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రెండు నూనెలు జుట్టుకు మేలు చేస్తాయి. ఈ నూనెల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది. దీంతో పాటు జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టులో కొత్త మెరుపు వస్తుంది.