వీటిని ఎక్కువగా తింటే మీరు ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటారు.
అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు వాటిని తప్పనిసరిగా తినాలి. విటమిన్-ఇ, విటమిన్-బి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు ఈ గింజల్లో లభిస్తాయి. ఇది రక్తపోటు ,బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మేలు చేస్తుంది.
అయితే వయసు మీదపడటం ఎవరికైనా ఇబ్బందికరమే అయినా జీవితంలో అది అనివార్యం. అయితే శరీరం, మనసును ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుకోగలిగితే ఏ వయసులోనైనా చలాకీగా ఉండటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నిత్య వ్యాయామం, పోషకాహారంతో వృద్ధాప్యం తొందరగా దరిచేరదు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసె గింజలతో యవ్వనోత్సాహం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ఉండే పోషకాలు దీర్ఘాయువును ప్రసాదిస్తాయని అంటున్నారు. రోజుకు ఒకటి రెండు స్పూన్ల అవిసె గింజల పొడిని సలాడ్స్, ఓట్స్‌లో వేసుకుని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
అవిసె గింజలు జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు పోషకాలను శరీరం బాగా గ్రహించగలిగేలా చేస్తాయి. అవిసె గింజలతో మనకు చేకూరే ప్రయోజనాలు చూద్దాం..స్ధూలకాయం, మధుమేహ ముప్పు నివారణ, ఇన్‌ఫ్లమేషన్‌కు చెక్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ముప్పు నుంచి రక్షణ, గుండెపోటు, స్ట్రోక్ ముప్పుల నుంచి రక్షణ, అల్జీమర్స్, డిమెన్షియాలకు చెక్, కండరాల బలోపేతం.