వడ్డే నవీన్ సినిమాలకు దూరం కావడానికి కారణం ఎవరో తెలుసా..?
వడ్డే నవీన్.. సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా పరాజయం పాలుకావడంతో ఆయన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు. అయితే వడ్డే నవీన్ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కావటానికి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ కూతురిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అందువల్ల సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం కక్ష సాధింపుగా వడ్డే నవీన్ కి సినిమా అవకాశాలు లేకుండా చేసి అతన్ని ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేశారని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.
అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవటంతో ఆయన అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు. ఇప్పటికైనా వడ్డే నవీన్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి జగపతి బాబు లాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వడ్డే నవీన్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన వ్యాపార వ్యవహారాలను చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
వడ్డే నవీన్ సినీ జీవితం నాశనం కావడానికి ఎన్టీఆర్ కుటుంబమే కారణమంటూ తరచూ ఆయన అభిమానులు మండిపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వడ్డే నవీన్ సినిమాలకు దూరమైనప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వడ్డే నవీన్ కుమారుడి ధోతి ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.