అప్పుడప్పుడు ఇలాంటి వంకాయకూర తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
వంకాయ..తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. అయితే వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు.. వంకాయలో ఫైబర్ మరియు పిండిపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. గ్లూకోజ్ శోషణ నియంత్రించడానికి మరియు టైప్2 మధుమేహం రోగులలో రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
వంకాయలో ఉండే పొటాషియం వలన శరీరంలో హైడ్రేట్లు,ద్రవాలు నిలువను తొలగించుట మరియు గుండె వ్యాధులను నిరోధిస్తుంది. దీనిలో ఉండే ఫుతో న్యూ త్రియంత్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. వంకాయలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది. ఆహారంలో వంకాయలను చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఫైటోన్యూట్రియెంట్లు మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు ఇది సహాయపడుతుంది. శరీరంలోని ఆక్సిడెంట్ కంటెంట్ స్థాయిని పెంచడం వల్ల అవయవాలు సురక్షితంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను తొలగించడంలో తోడ్పడుతుంది.
వంకాయలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. అదిక పీచు పదార్థం కలిగి ఉండటం వల్ల మీకు పొట్ట నిండుగా అనిపిస్తుంది. బరువు తగ్గాలను కునే వారు వంకాయను ఆహారంలో తీసుకోవచ్చు. కాలిన గాయాలు ఉన్నప్పుడు వంకాయలతో వండిన ఆహారాన్ని అధికంగా తినాలి. వంకాయల వల్ల దురద కలుగుతుందని పుండ్లు, ఇన్ఫెక్లన్ల సమయంలో వంకాయ తినరు. కానీ వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు గాయాలను త్వరగా మానిపోయేలా చేస్తాయి. వంకాయాల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.వంకాయలు తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధికి ఇది గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దాని వల్ల ఎముకలకు అవసరమైన పుష్టి ఇందులో లభిస్తుంది. ఆకలి పెరుగుట మరియు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకం మరియు పెద్దప్రేగు క్యాన్సర్ నిరోధించడానికి,హేమరయిడ్స్,పెద్దప్రేగు, పుండ్లు, మరియు కడుపు వాపులు నుండి ఉపశమనంకలిగిస్తుంది. వంకాయలలో ఖనిజాలు,విటమిన్లు మరియు డైటరి ఫైబర్ సమృద్దిగా ఉన్నాయి.అధిక నీరు ఉండుట వలన పొడి,ఫ్లాకీ,ముడతలు,చర్మం చికిత్స,చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.