Health

విక్స్ తో ఇలా చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!

ఎన్నో బెన్ఫిట్స్ ఉన్న విక్స్ ని, మరెన్నో ప్రయోజనాలున్న వెల్లుల్లితో కలిపి తీసుకుంటే.. పొందే ఫలితాలు అమోఘమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. విక్స్, వెల్లుల్లి కాంబినేషన్ రకరకాల వ్యాధులను నయం చేస్తుందట. అయితే చిన్నారులకు జలుబు, దగ్గు చేస్తే చెస్ట్‌కి విక్స్ రాస్తుంటాము. పెద్దవాళ్లు కూడా జలుబు చేసి ముక్కుదిబ్బడ వేస్తే విక్స్ వేపోరబ్ పీలుస్తుంటారు. దాంతో ఎంతో ఉపశమనంగా ఉంటుంది. తలనొప్పి బాధిస్తుంటే దంచిన వెల్లుల్లి రేకులపై కొద్దిగా విక్స్ రాసి ముక్కు దగ్గర పెట్టుకుని ఆ వాసనని బాగా పీలుస్తుంటే తలనొప్పి తగ్గిపోతుంది.

ఇక రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా దోమలు కుడుతుంటే.. కొద్దిగా విక్స్ తీసుకుని దానికి కొంత వేజలిన్ కలిపి చర్మానికి లేదంటే వేసుకున్న బట్టలకు రాసుకుంటే దోమలు కుట్టవు. హాయిగా నిద్రపోవచ్చు. ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతుంటే రోజుకు కనీసం 3 సార్లు విక్స్‌ను వాటిపై రాస్తుంటే కొన్ని రోజులకు తగ్గిపోతాయి. విక్స్‌ను కొద్దిగా తీసుకుని ఆహార పదార్ధాల దగ్గర ఉంచితే వాటిపై ఈగలు వాలవు. గాయం అయినచోట విక్స్ రాస్తే త్వరగా మానుతుంది. శరీరంలో కండరాల నొప్పులు ఉంటే ఆ ప్రదేశంలో విక్స్ రాసి వేడి నీటిలో ముంచిన టవల్‌ని పిండి గట్టిగా చుట్టాలి. దాంతో నొప్పులు తగ్గిపోతాయి. కొందరి చర్మం పొడిగా ఉంటుంది.

అలాంటప్పుడు తరచూ విక్స్ రాస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. టెన్నిస్ ఎల్బో సమస్య ఉన్నవారికి విక్స్, మెంథాల్, కర్పూరంలను బాగా కలిపి మోచేతిపై పెట్టుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. పాదాల పగుళ్లకూ విక్స్ బాగా పనిచేస్తుంది. రాత్రి పూట పగిలిన పాదాలకు విక్స్ రాసి సాక్సులు వేసుకోవాలి. ఉదయాన్నే సాక్సులు తీసి వేడి నీటితో కాళ్లను కడుక్కుంటే తగ్గిపోతాయి. వారం పది రోజుల పాటు ఇలా చేస్తే పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అరిపాదాలు అందంగా తయారవుతాయి. కాలి వేళ్లకు ఉన్న గోళ్లు పుచ్చిపోయి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తే ఆ ప్రదేశంలో విక్స్ రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే ఇన్‌ఫెక్షన్ తగ్గిపోతుంది.

చర్మం సాగిపోయి స్టెచ్ మార్క్‌లు ఏర్పడితే ఆయా ప్రదేశాల్లో విక్స్ రాయాలి. 2 వారాల పాటు ఇలా చేస్తుంటే స్టెచ్ మార్క్స్ తగ్గిపోతాయి. పొట్ట దగ్గర పెరిగిన ఫ్యాట్‌ని విక్స్ తగ్గిస్తుంది. రోజూ కొంత విక్స్ తీసుకుని పొట్ట మీద మర్దనా చేస్తుండాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తుంటే పొట్ట తగ్గుతుంది. ఇంట్లో పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఓ మూల విక్స్ డబ్బా ఓపెన్ చేసి పెడితే ఆ సమస్య ఉండదు. చర్మంపై దురదలు వస్తుంటే విక్స్ రాస్తే ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పితో చిన్నారులు కానీ, పెద్ద వారు కానీ ఇబ్బంది పడుతుంటే కొద్దిగా కాటన్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గిపోతుంది. వర్షాకాలంలో తలుపులు కిర్రు కిర్రు మని శబ్దం చేస్తుంటే ఆ ప్రదేశంలో కాస్త విక్స్ రాస్తే నో సౌండ్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker