Health

మీలో ఆ కోరికలు తగ్గిపోతున్నాయా అయితే అసలు కారణం ఏంటో తెలుసుకోండి.

ఒక్కోసారి కోరికలున్నా సక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో రుతు సమస్యలు కారణమైతే, పురుషుల్లో వయస్సు మీద పడటంతో శృగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే శృంగార జీవితం కంటిన్యూ చేస్తే అనేక లాభాలుంటాయని డాక్టర్లు సెలవిస్తున్నారు. ముఖ్యంగా పురుషుల్లో వయస్సు 40 దాటిన తర్వాత సక్స్ పట్ల అంతగా ఆసక్తి చూపరు. ఇక స్త్రీలలో అయితే రుతుక్రమం ఆగిపోయే ముందు కూడా సక్స్ పట్ల ఆసక్తి ఉండదు. అయితే భార్యాభర్తల బంధంలో లైగిక చర్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచి దూరాన్ని తగ్గిస్తుంది.

కానీ కొంతమందిలో ఆ ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. ఎందుకో కారణం వారికి కూడా తెలియదు. దీనివల్ల వైవాహిక బంధంలో కలతలు రావచ్చు. లైంగికాసక్తి తగ్గడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం. ఈ విషయం తెలిసిన వారు చాలా తక్కువమందే ఉంటారు. విటమిన్ డి ను ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. అలాగే ‘సెక్స్ విటమిన్’ అని కూడా అంటారు. అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం విటమిన్ డి లోపం వల్ల వ్యక్తుల సెక్స్ డ్రైవ్‌లో మార్పులు వస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే లైంగికాసక్తి తగ్గిపోతుంది.

విటమిన్ డి లోపం కేవలం పురుషులను మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మహిళల్లో తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలకు కారణం అవుతుంది. దీని వల్ల వారిలో కూడా విటమిన్ డి లోపం వస్తుంది. క్లీవ్‌ల్యాండ్ హార్ట్ ల్యాబ్ చేసిన పరిశోధన ప్రకారం, విటమిన్ డి జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త నాళాల గోడల లైనింగ్‌ను మెరుగుపరచడం ద్వారా ఇది లైంగిక జీవితాన్ని రక్షిస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి వాపును తగ్గిస్తుంది. స్త్రీలో..విటమిన్ డి లేక ఇతర కారణాల వల్ల ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గితే సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయి.

జననేంద్రియ గోడలోని కండరాలు ఆరోగ్యంగా ఉండవు.ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల జననేంద్రియాలు పొడిగా మారిపోతాయి. పురుషుల్లో.. విటమిన్ డి లోపం వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. వెంట్రుకలు ఊడిపోవడం, కండరాలు కరిగిపోవడం, ఛాతీ భాగం పెరగడం వంటివి జరుగుతాయి. 2018లో 114 మంది పురుషులపై అధ్యాయనాన్ని నిర్వహించారు. విటమిన్ డి, లైంగిక పనితీరు మధ్య సంబంధాన్ని పరిశీలించారు. విటమిన్ డికి, లైంగికాసక్తికి మధ్య బంధాన్ని ఈ అధ్యయనాన్ని ధ్రువీకరించింది.

పరిశోధన ప్రకారం, తక్కువ సెక్స్ డ్రైవ్‌తో బాధపడుతున్న పురుషులు రెండు వారాల పాటూ రోజుకు 30 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిలబడితే మంచిది. సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ శరీరంలో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఎండ బారిన పడి దెబ్బతినకుండా కాపాడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, మెలనిన్, సెక్స్ హార్మోన్లు ఒకదానికొకటి తమ పనితీరును మెరుపరుచుకోవడానికి సహకరించుకుంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker