Walnuts: వాల్నట్స్ రోజు రెండు తింటే చాలు, ఈ రోగాలు మీ జోలికేరావు.

Walnuts: వాల్నట్స్ రోజు రెండు తింటే చాలు, ఈ రోగాలు మీ జోలికేరావు.
ప్రతిరోజూ నానబెట్టిన 2 వాల్ నట్స్ తింటే.. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే వాల్నట్ మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. వాల్నట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వాల్నట్స్లో ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వాల్నట్లలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.
Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..!
రోజు రెండు వాల్నట్స్ తినటం వల్ల దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్లు ఫైబర్, ప్రోటీన్లకు గొప్ప మూలం, ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి.
Also Read: 9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి.
వాల్నట్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వాల్నట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. వాల్నట్ చర్మాన్ని మెరిపిస్తుంది, ముడతలు తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపున 2 వాల్నట్లు నానబెట్టినవి తీసుకోవాలి.