నీటిలో ఈ పొడిని కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్యను సులభంగా తగ్గిపోతుంది.

వేప ఆకులు, గింజలు, బెరడు, లేత కాండం అన్నీ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. సాంప్రదాయ ఔషధాల తయారీకి వేప ఆకులను ఉపయోగించారు. వేప యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడే గొప్ప నిధిగా చెబుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు హానికరమైన UV కిరణాలు, కాలుష్యం,ఇతర పర్యావరణ కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అయితే భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
వేపపువ్వు ను హిందువులు లక్ష్మీదేవిగా పూజిస్తారు. వేపను ఆయుర్వేద శాస్త్రం సర్వరోగ నివారిణిగా పేర్కొంటుంది. వేపగింజల నుండి తయారైన నూనెను క్రిమిసంహారిగా కూడా ఉపయోగిస్తున్నారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా ఉపకరిస్తుంది.
వేప చెట్టుకు చెందిన ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు, పండ్లు లేదా పూలు ఇలా ప్రతిభాగాన్ని ఆయుర్వేద చికిత్సా విధానంలో విరివిగా వాడతారు. చుండ్రును నివారించే వేప ఆకులు, బెరడు.. ప్రస్తుత కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. తలపై చర్మం నుండి మృతకణాలు తొలగిపోవడం వల్ల పొరలు పొరలుగా పొట్టు రూపంలో విడిపోతుంది.
చుండ్రు ఎక్కువగా ఉంటే దానిని తొలగించుకోవటానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. యాంటీడాండ్రఫ్ షాంపూలు, ఔషధాలు ఎన్ని వాడినా ఫలితం ఉండదు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి.
ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. వేప చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. జుట్టు, చర్మం, దంతాలు మొదలైన సమస్యలకు చక్కటి పరిష్కారం అందించడానికి వేప ఉపయోగపడుతుంది. వేపలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు హానికరమైన UV కిరణాలు, కాలుష్యం,ఇతర పర్యావరణ కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.