ఈ విత్తనాలు తింటే చాలు మీ కండరాలు దృఢంగా మారుతాయి.
వేసవిలో మన శరీరం డిహైడ్రెషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ తింటే శరీరానికి చల్లదనంతో పాటు కావలిసిన నీరు, ఎలక్త్రోలైట్స్ కూడా అందుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే పుచ్చకాయలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం.అయితే మార్చి రానే వచ్చింది. సూర్యుడు కూడా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఈ టైంలో శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే ఎండాకాలంలో ఎక్కువగా అందరూ తీసుకునే ఆహారం ఎక్కువగా పుచ్చకాయలు. ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే పుచ్చకాయలను నిత్యం తింటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.
అయితే మనలో చాలామంది మాత్రం పుచ్చకాయలను తిని వాటి విత్తనాలను మాత్రం ఊసేస్తుంటాం. అయితే అలా విత్తనాలను ఊసెయ్యొద్దు అంటున్నారు. పచ్చ విత్తనాలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయంటూ చెబుతున్నారు. డయాబెటిస్(షుగర్) ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది. బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఏదైనా పని చేసేప్పుడు అలసట తగ్గుతుంది.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని, పుచ్చ విత్తనాలను నిత్యం తింటుంటే నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.