Health

ఈ చిట్కాలను పాటిస్తే తెల్లని జుట్టు తిరిగి నల్లబడుతుంది.

తెల్ల జుట్టుకు జన్యుపరమైన అంశాలు, తినడం మరియు చింతలు మాత్రమే కారణం కాదు మీరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ మరియు కారంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే, బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మీ జుట్టు త్వరగా తెల్లగా మారుతుంది. అయితే ఒకప్పటివారికి 30 లేదా 40 సంవత్సరాల తర్వాతే తలలో ఎక్కడో ఒక చోట జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభించేది. కానీ ఇప్పటి యువతను చిన్ననాటి నుంచే ఈ సమస్య వెంటాడుతోంది.

ఆ సమస్యను అధిగమించడానికి యువత అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. డై, కలర్, మెహందీ… ఇలా మార్కెట్‌లో అన్నీ దొరుకుతాయి. తాత్కాలికంగా అవి కొంత సహకరిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుందా.. లేదా.. అని ఆలోచించే ముందు దాని వెనుక ఉన్న కారణాలను మనం తెలుసుకోవాలి. సాధారణంగా పోషకాహార లోపం లేదా చెడు ఆహారం అలవాట్ల కారణంగా ప్రజలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదనంగా కొందరికి జన్యుపరమైన కారణం కూడా ఉంటుంది.

వృద్ధాప్యం కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఎదుర్కొనవలసిన సమస్యే. కాబట్టి వృద్ధాప్యం వల్ల నల్లని జుట్టు తెల్లగా మారుతుంది. కానీ సరైన జీవనశైలిని అనుసరించడం వల్ల బూడిద జుట్టును ఆలస్యంగా వచ్చేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో తెల్ల జుట్టు నల్లబడవచ్చు. కానీ దీనికి కొంత సమయం పడుతుంది. అయితే ఖచ్చితమైన ఫలితాలు కూడా ఉండవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఏం చేయాలంటే.. ముందుగా మీ జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందో మీరు తెలుసుకోవాలి.

ఏదైనా ఆరోగ్య కారణం ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించడం మీకు శ్రేయస్కరం. మీకు ఏదైనా పోషకాహార లోపం ఉన్నట్లు డాక్టర్ భావిస్తే, దానికి సరైన ఆహార ప్రణాళికను ఆయన లేదా ఆమె సూచిస్తారు. కొబ్బరి నూనె, ఉసిరిని ఉపయోగించడం వల్ల మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఉసిరిలో కొల్లాజెన్‌ను పెంచే శక్తి ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరం, ఇంకా నల్లటి జుట్టును పెంచుతుంది. కావాలంటే.. మీరు కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని మిక్స్ చేసి కూడా మీ జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

దీనికి అదనంగా ఉసిరి తినడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అంతర్గతంగా నల్లటి జుట్టు పెరగడానికి ఉసిరి సహాయపడుతుంది. ఆముదం, ఆలివ్ నూనె జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహకరిస్తాయి. ఆముదంలో జుట్టు రాలడాన్ని నిరోధించే మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇంకా ఆవపిండిలో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, కాల్షియం ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణను అందించడం ద్వారా నల్లబడటానికి సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం.. గోరింట ఆకులను ఆవనూనెలో వండుకుని, ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు నల్లబడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker