తెల్ల ఉల్లిపాయతో లైంగిక శక్తి అమాంతం పెరుగుతుందా..? అసలు విషయం తెలిస్తే..?

తెల్ల ఉల్లిపాయలు తింటే గుండె జబ్బులు కూడా తగ్గుతాయనేది నిపుణుల మాట. వీటిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయలను తరచూ తింటే సీజనల్ వ్యాధుల భారీన పడకుండా రక్షణ కల్పిస్తాయి. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.
అయితే తెల్ల ఉల్లిపాయ ప్రయోజనాలు.. తెల్ల ఉల్లిపాయలో విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, సోడియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్ మొదలైన పోషకాలు లభిస్తాయి. వీటితోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా సలాడ్స్ లో వినియోగించడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను సులభంగా బయటికి పంపిస్తుంది. తరచుగా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ఈ తెల్ల ఉల్లిపాయలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి తెల్ల ఉల్లిపాయల రసాన్ని క్రమం తప్పకుండా వెంట్రుకలకు అప్లై చేయాలి.
చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా బట్టతల సమస్యలకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని ఆయుర్వేదనలు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చుండ్రు సమస్యలను కూడా దూరం చేస్తాయి. తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలను పచ్చివిగా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
క్వెర్సెటిన్, ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయల్లో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ ఉల్లిపాయలను పచ్చివిగా తినాల్సి ఉంటుంది.