ఈ ఒక్క కారణంతోనే దిల్‌రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు.
దిల్ రాజు తన సొంత ప్రొడక్షన్ హౌస్ వెంకటేశ్వర బ్యానర్ సినిమాల్లో తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు దిల్ రాజు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. భార్య చనిపోయిన తర్వాత రాజు ఒంటరి అయిపోయాడు. దాంతో ఈయనకు తోడు కావాలని.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో రాజు కూడా ఆ వైపుగా ఆలోచించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ” నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్.
నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా” అంటూ దిల్‌రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టారు.