News

వామ్మో, మొగుడిని వాకింగ్‎కని తీసుకెళ్లి కొట్టి చంపేసిన భార్య.

సంసారం నిలవాలంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం కావాలి. అప్పుడే దాంపత్యంలో గొడవలు లేకుండా సాఫీగా సాగుతుంది. అలాగని పూర్తిగా అల్లర్లు లేకపోతే కూడా బాగుండదు. చిన్న చిన్న గొడవలు ఉంటేనే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. గొడవలు ముదిరితే తెగతెందపుల దాకా వెళ్తుంది. అయితే కొత్తగా పెళ్లయింది.. సరదాగా కొన్ని రోజులు గడుపుదామని అత్తమామల వద్దకు వచ్చిన అల్లుడిని గుర్తు తెలియని నిందితులు హత్య చేశారు. ఈ ఘటన పుణెలోని మావల్‌లోని గహుంజేలో చోటుచేసుకుంది.

అయితే ఈ హత్యాకాండ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో తేలిన విషయాలు విని షాక్‌ తిన్నారు. పదే పదే శారీరకంగా హింసించడం, కొట్టడంతో విసిగి వేసారిన భార్యే భర్తను హత్య చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. విచారణ అనంతరం పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు మీడియాకు ఈ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో హత్యకు గురైన సూరజ్ భార్యను తాలెగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్య కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన భర్తను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారని పోలీసుల విచారణలో పేర్కొంది చనిపోయిన సూరజ్ భార్య కల్పన. దీంతో కేసు నుంచి తేలికగా బయటపడవచ్చని అనకుంది. కానీ ఆమె బూటకం ఎక్కువ సేపు నిలువలేదు. చివరగా పోలీసుల విచారణలో తను అసలు నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. అంతే కాకుండా తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిద్దరి పెళ్లి మూడు నెలల క్రితమే జరిగింది.

సూరజ్ ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లయిన తర్వాత సూరజ్ తనను శారీరకంగా హింసించేవాడని, తీవ్రంగా కొట్టేవాడని భార్య ఆరోపిస్తోంది. దీంతో విసిగి వేసారిన భార్య భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఆ ప్రకారం ఆదివారం సెలవు దినం కావడంతో సూరజ్ తన అత్తమామల ఇంటికి రాగా, అతడి భార్య వాకింగ్ కు తీసుకెళ్లింది. అటుగా పొలాల్లోనికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే సూరజ్ ను చంపేందుకు ప్లాన్ చేసి కొందరిని కల్పన అక్కడ కాపు కాయించింది. వారంతా సూరజ్ కోసం మాటువేశారు.

అక్కడికి సూరజ్ చేరుకోగానే ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తలేగావ్ దబాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. అయితే భార్యను పదే పదే ప్రశ్నించడంతో అంతా బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్యను తలేగావ్ దభాడే పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker