భార్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అబద్ధాలు చెప్పకండి. పొరపాటున చెప్పారో..?
‘అబద్ధం’ అంటే.. ఎవరో ఒకరు మనల్ని మాటలతో లేదా చర్యలతో మోసం చేయడం. వాస్తవానికి సాధారణ సంభాషణ మాత్రమే వాస్తవాల మధ్య నడుస్తుంది. మీరు చేసిన ప్రతి సంభాషణలో మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ గురించి, మీ జీవిత నిర్ణయాల గురించి నిజంగా ఏమనుకుంటున్నారో చెప్పమనండి. అవి వింటే మీరు భరించలేరు. అయితే మీ రిలేషన్‌షిప్‌ను దృఢంగా మార్చుకోవడానికి పొరపాటున కూడా మీ జీవిత భాగస్వామికి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, అవి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెడతాయి.
ముఖ్యంగా ఈ అబద్ధాలు మీ జీవిత భాగస్వామికి అస్సలు చెప్పకూడదు. మీ మాజీ ప్రియుల గురించి అబద్ధాలు చెప్పకూడదు. మీ మాజీ ప్రియులు లేదా మాజీ భార్యతో సన్నిహితంగా ఉండటం మీ వ్యక్తిగతం కావచ్చు, కానీ మీ ప్రస్తుత భాగస్వామి వద్ద ఈ సత్యాన్ని దాచడం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. అది చివరకు విడిపోవడానికి దారితీస్తుంది. అబద్ధపు భావోద్వేగాలు చూపొద్దు, లేని ప్రేమను నటించవద్దు. మీ భాగస్వామితో కలిసి జీవిస్తున్నప్పుడు ప్రేమ లేకున్నా ప్రేమిస్తున్నట్లుగా, గొడవలు జరుగుతున్నా ఆనందంగా ఉంటున్నట్లుగా భావోద్వేగాలను నటిస్తే, అది కృత్రిమంగా ఉంటుంది.
మీకు వారంటే ఇష్టం లేకున్నా బలవంతంగా కాపురం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీంతో మీ బంధం మరింత బలహీనమవుతుంది. మీ సంపాదన ఎంతనేది దాచినా పర్వాలేదు కానీ, మీరు చేసే వృత్తి గురించి అబద్ధం చెప్పకూడదు. మీరు మీ భాగస్వామితో మీ ఉద్యోగం ఒకటి చెప్పి, మీరు చేసే పని వేరొకటి అయితే.. అది తెలిసిన నాడు మీకు ఉంటుంది, ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏం ఉండదు. నిజం కాని నిజం చెప్పడం, పూటకో మాట మాట్లాడటం మంచిది కాదు.
ఇది మీరు వారిని మోసం చేస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది. మీపై అనుమానాలు పెరుగుతాయి. మీ భాగస్వామికి ఒక విషయం, వేరొకరికి అదే విషయాన్ని ఇంకోలా చెప్పడం చేయవద్దు. అసలు విషయం మీ భాగస్వామికి తెలిసినపుడు మీపై నమ్మకం పోతుంది. అబద్ధపు వ్యక్తిత్వం కనబరచడం, మీరు మంచివాళ్లుగా నటించడం చేయవద్దు. మీ వ్యక్తిత్వం ఎలాంటిది, అది మంచైనా.. చెడైనా మీ భాగస్వామికి మీరు ఏమిటి, మీ నిజస్వరూపం ఏమిటి అనేది ముందునుంచే తెలిసి ఉండాలి. వ్యక్తిత్వాన్ని అబద్ధం చేస్తే, మీకు తిరిగి అదే లభిస్తుంది. అది విడిపోవటానికి దారితీయవచ్చు.