Health

బరువు తగ్గాలని చపాతీ తింటున్నారా..? అసలు విషయం తెలిస్తే..?

బరువు తగ్గాలని భావించేవారు భోజనానికి ముందు ఒక కప్పు సూప్ తాగితే మంచిదని చెబుతున్నారు. ఇక సూప్ లో క్యారెట్, క్యాబేజ్ వంటి కూరగాయలను వేసుకుని చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఒక కప్పు సూప్‌తో భోజనాన్ని ప్రారంభిస్తే తక్కువ భోజనం చేస్తారని, దానివల్ల బరువు తగ్గడానికి వీలవుతుందని చెబుతున్నారు. అయితే గంటల తరబడి కూర్చోవడానికే చూస్తున్నారు. దీంతో విపరీతంగా బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వర్క్ ఫ్రం హోం, సాప్ట్ వేర్ జాబ్స్ చేస్తున్న వారిలో శారీరక శ్రమ బాగా తగ్గింది.

దీంతో వారి పొట్ట చుట్టూ భారీగా కొవ్వు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వచ్చిన పొట్ట పోవడం అంత తేలికైన విషయం కాదు. దీనికోసం జిమ్ లో గంటల తరబడి చెమట చిందించాల్సి ఉంటుంది. ఇదంతా నా వల్ల కాదు అనుకుంటే.. మీ బరువు తగ్గడానికి ఓ సింపుల్ చిట్కా మీ కోసం..సత్తు రోటీతో బరువుకు చెక్..మీరు బరువు తగ్గాలనుకుంటే సత్తు రోటీ లేదా సత్తు చపాతీని ట్రై చేయండి.. దీని తినడం వల్ల మీరు సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఊబకాయం నుండి బయటపడతారు.

ఈ చపాతీని మీ ఇళ్లలోని సింపుల్ గా తయారుచేసుకుని తినవచ్చు. సత్తులో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగు పరచడంలో సత్తు సూపర్ గా పనిచేస్తుంది. మీరు రోజూ సత్తు రోటీని (Sattu Roti Benefits) తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా కరుగుతుంది. సత్తు రోటీని ఎలా తయారు చేయాలి? సత్తు రోటీని తయారు చేయడం అంత కష్టమేమి కాదు.

ముందుగా దీని కోసం 2 గిన్నెల పిండి, 1 గిన్నె సత్తు పొడి, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 టీస్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టీస్పూన్ ఆవాల నూనె, 2 పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ కొత్తిమీర ఆకులు, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. సత్తు చపాతీని చేసే ముందు పిండిని మెత్తగా చేసి అందులో మిగతా పదార్ధాలన్నీ కలపాలి. అప్పుడు చపాతీ కర్రతో గుడ్రంగా చేసి గ్రిడిల్ మీద వేయించాలి. అంతే రోటీ రెడీ. మీరు కావాలంటే రోటీ మీద నెయ్యి రాసుకుని కూడా తినొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker