చలికాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యలకు ఇలా చెక్ పెట్టొచ్చు.
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు అధికంగా విజృంభిస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా చల్లగా ఉండటంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా ఉండి, జలుబు, చలితో బాధపడుతుంటే, కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అయితే అన్ని కాలాలలో కంటే చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే చలికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
అయితే ముందు జాగ్రత్తగా చలికాలంలో వచ్చే ఈ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తూనే ఉంటాయి. అయితే నిపుణులు చెప్పిన దాని ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, ఫ్లూ వచ్చినప్పుడు అలసట, నీరసం, తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం ఆ సమస్య మరింత ఎక్కువ ఉంటుంది. చల్లటి వాతావరణం వలన వారి సమస్య కూడా పెరుగుతుంది.
చలికాలంలో వాతావరణ పీడనం తగ్గడం వలన శరీరంలో పెన్ గ్రాహకాలు మరింత సున్నితంగా మారుతాయి. దీనివలన కీళ్లలో వాపులు వచ్చి నొప్పి ఎక్కువ అవుతుంది. దీంతో కీళ్ల నొప్పులు ఉన్న వ్యక్తులు ఎక్కువగా బాధపడతారు. చలికాలంలో చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. ఈ పరిస్థితుల్లో నొప్పి ఎక్కువ కాకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
చిన్నపిల్లలు, శిశువులకు బ్రొన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో స్లేష్మం ఏర్పడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు వైద్యులు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్యలనేవి వస్తాయి. వీటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి బలంగా ఉండడం అవసరం. అందుకే ఎక్కువగా తులసి కషాయాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగ చేయాలి. చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ధరించాలి.