అబార్షన్ తర్వాత మహిళలు ఈ విషయాల్లో జాగర్తగా ఉండాలి. లేదంటే..?
పిండం ఆమెకు హాని కలిగించదని వైద్య బోర్డు నిర్ధారించడంతో ఆమెకు గర్భస్రావం చేసేందుకు అనుమతించింది. 2021లో సవరించిన అబార్షన్ చట్టంలోని నిబంధనలలో ఇప్పుడు ‘భర్త’ అనే పదానికి బదులుగా ‘భాగస్వామి’ అనే పదాన్ని చేర్చినట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పెళ్లైన ప్రతి మహిళ మొదటి కోరిక అమ్మా అని పిలుపించుకోవాలని. పిల్లల రాకతో తల్లిదండ్రుల జీవితం పూర్తిగా మారిపోతుంది. అందులో ఆ తల్లికి పిల్లలే లోకమైపోతారు. నెలతప్పాను అన్న శుభవార్త తెలిసిప్పటి నుంచి ప్రతిక్షణం కడుపులో ఉన్న బిడ్డగురించే ఆలోచిస్తారు ఆడవారు.
కానీ అనుకోని కారణాల వల్ల నేడు ఎంతో మందికి అబార్షన్ అవుతోంది. ఈ బాధ మాటల్లో చెప్పలేనిది. దీనినుంచి మానసికంగా, శారీరకంగా కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అబార్షన్ కారణంగా రక్తస్రావం ఎక్కువయ్యి.. వీరిలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అబార్షన్ అయిన వారిలో ఐరన్ లోపిస్తుంది. ఇది కాస్త రక్తహీనతకు కారణమవుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం..అబార్షన్ అయిన తర్వాత ఆడవారిలో కాల్షియం లోపిస్తుంది. ఈ కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి.
అందుకే ఇలాంటి సమయంలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు, సీఫుడ్ వంటి ఆహారాలను ఎక్కువగా తినండి. బాడీని హైడ్రేట్ గా ఉంచండి..అబార్షన్ అయిన తర్వాత కొంతమందికి వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు వస్తాయి. వీటికి అసలు కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు. ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్న వారికి చెమట పడితే.. శరీరంలో ఉన్న నీరంతా పోతుంది. దీంతో వీళ్లు డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. డీహైడ్రేషన్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే ఈ సమయంలో మీ శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు నీళ్లను, కొబ్బరి నీళ్లను, ఇతర హెల్తీ పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఫోలిక్ ఆమ్లం..ఈ ఫోలిక్ ఆమ్లం ఎర్రరక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడతుంది. అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అబార్షన్ అయిన వారిలో రక్తం తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. ఇందుకోసం వాల్ నట్స్, అవకాడో, బాదం పప్పులను ఎక్కువగా తినాలి. ఇష్టమైన ఆహారాలు..ఇలాంటి సమయంలో ఇష్టమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.
నచ్చిన ఫుడ్ ను తిన్నప్పుడు మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే ఈ సమయంలో నచ్చిన ఫుడ్ ను తినండి. త్వరగా కోలుకుంటారు. ఏమి తినకూడదు..అబార్షన్ అయిన వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను తినకపోవడమే మంచిది. అలాగే ఆయిలీ ఫుడ్ ను అసలే తినకూడదు. ఆకలితో కడుపును మాడ్చడం కూడా మంచిది కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినకండి. ఇవి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ప్రతిరోజూ ధ్యానం లేదా యోగాను చేయండి. ఇవి మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.