రోజూ ఇలా యోగా చేస్తే.. రెండు వారాల్లో బెల్ల్య్ ఫాట్ తగ్గిపోతుంది.
సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. అయితే యోగా సాధన చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా యోగా చేయుడం వల్ల పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రించవచ్చు.
బరువును తగ్గించడమే కాకుండా టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, ఇతర సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అయితే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా యోగా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. షోల్డర్ స్టాండ్ పోజ్..సర్వంగాసన యోగాను షోల్డర్ స్టాండ్ పోజ్ అని కూడా అంటారు. ఈ పోజ్‌తో రోజు వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇదే క్రమంలో బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది.
అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా రోజూ చేయాలి. విరాభద్రసనా భంగిమ సాధన..విరాభద్రాసన యోగా శరీరానికి కష్టతరమైన ఆసనాలలో ఒకటి. అయితే ఈ సాధనను రోజూ చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ సాధనను రోజూ చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాలను కూడా నియంత్రిస్తుంది.