Health

ఈ చెట్టు పూలు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి. వీటి గురించి తెలిస్తే..?

పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయుదురు. అయితే పారిజాతం వృక్షాన్ని శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించినట్లు పురాణాల కథనం. ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఎందుకంటే ఈ చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి.. ఉదయం పూట తాను పూసిన పూలన్నింటినీ రాల్చేస్తుంది. అందుకనే దీనిని రాత్ కీ రాణి గా పిలుస్తారు. పారిజాతం పూలు దైవారాధన కు ఉపయోగిస్తారు.

ఈ చెట్టు పూలు, ఆకులు వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పారిజాతం రసం శ్వాసనాళ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, బ్రోన్కైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు తగ్గిస్తుంది. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపుతుంది. ఇటీవల అధ్యయనాలు పారిజాతం యొక్క యాంటిపైరెటిక్ చర్యను గురించి వెల్లడించాయి. పారిజాత ఆకుల పేస్ట్, నోటి ద్వారా తీసుకున్నపుడు మలేరియా లక్షణాలను తగ్గిస్తుందని క్లినికల్ అధ్యయనాలలో తేలింది. ఇది రక్త ప్లేట్ లెట్ లను వృద్ధి చేస్తుంది. కీళ్ళనొప్పుల తగ్గడానికి ఆయుర్వేద వైద్యులు పారిజాతం ఆకుల కషాయం తీసుకోమని చెబుతున్నారు.

పారిజాతం యొక్క ఆకుల నుండి తీసిన రసం అద్భుతమైన నొప్పినివారణ ఔషధిగా పనిచేస్తుందని వైద్య సర్వే లో తేలింది. శారీరక, మానసిక ఒత్తిడి , ఆందోళనను తగ్గించడానికి పారిజాత నూనెను పరిమళ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది మీ మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని నియంత్రించి, ప్రశాంత భావనను కలిగిస్తుంది. పారిజాతం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇది మొటిమలను నివారిస్తుంది. ఇంకా అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

పారిజాతం ఆకులు, పువ్వులు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే దగ్గు, జలుబు, విపరీతమైన బ్రోన్కైటిస్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇక జ్వరం ను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పారిజాతం ఆకులు డయాబెటిస్ కి మంచి మందు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు పారిజాతం ఆకులు అధ్బుతంగా పనిచేస్తాయి. పారిజాతం చెట్టు పూలు, తీసిన పదార్థాలు చక్కెర వ్యాధి నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయని జంతువులపై జరిపిన అధ్యయనాలలో తేలింది.

విరిగిన ఎముకల చికిత్సలో కూడా పారిజాతాన్ని బాగా వాడుతున్నారు. ఇంకా పారిజాతాన్ని జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మందుగా ఉపయోగిస్తారు. పారిజాతం గింజలతో చేసిన కాషాయం లేదా టీ తలలోని చుండ్రు, వంటి వాటిని నివారణకు పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పారిజాతం పువ్వులను కేశపుష్టి కోసం ఉపయోగించడమనేది సంప్రదాయికంగా వస్తోంది. మగువలు పొడవైన, ఆరోగ్యకరమైన వెంట్రుకలు పొందడానికి పారిజాత పుష్పాలను సాంప్రదాయికంగా ఉపయోగిస్తున్నారు. పారిజాతం వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker