Health

ఈ డైట్ పాటిస్తే మీరు నూరేళ్ళు బతికేయచ్చు, శతాధికుల చెప్పిన రహస్యం ఇదే.

ఒకప్పుడు మన పూర్వీకులు 100 ఏళ్ళ వరకు జీవించి ఉండేవారని చెబుతారు. కానీ, ప్రస్తుతం అలాంటి ఆలోచన చేయడమే అసాధ్యంగా అనిపిస్తోంది. కానీ, పరిస్థితి మారుతోంది. ప్రపంచమంతా నూరేళ్లు బ్రతకాలంటే ఏమి చేయాలి అనే విషయం పై కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే సుమారు నూరేళ్ళ కంటే ఎక్కువ జీవించి ఉన్న అనేక మంది జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, కాలిఫోర్నియాలో జీవిస్తున్నారు. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బ్లూ జోన్ అని పిలిచారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు సెంచరీ కొట్టకుండ ఉండరు.

ఆన్ని సంవత్సరాలు ఎటువంటి సమస్యలు లేకుండా జీవించి ఉండటానికి కారణాలని పరిశోధకులు తెలుసుకున్నారు. వారి జీవన విధానాలు మాత్రమే కాదు ఆహారం వల్ల అన్నేళ్ళు జీవించగలుగుతున్నారు. 11 ఆహార నియమాలు పాటించడం వల్లే బ్లూ జోన్ ప్రజలు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. మొక్కల ఆధారిత ఆహారం ఆహారంలో సుమారు 95 నుంచి వంద శాతం వరకు వాళ్ళు తీసుకునే పదార్థాలు మొక్కల ఆధారితమైనవి. బచ్చలికూర, కాలే, బీట్ రూట్, టర్నిప్, కొల్లార్డ్స్ వంటి ఆకుకూరలు ఉత్తమమైన దీర్ఘాయువునిచ్చే ఆహారాలు. కాలానుగుణ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ గింజలు కూడా తీసుకుంటారు.

వెన్నకి బదులుగా ఆలివ్ నూనె ఎంచుకుంటారు. ఎప్పుడో ఒకసారి మాంసం..మనలో కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ దీర్ఘాయువులు మాత్రం మాంసం ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు. కాలిఫోర్నియాలోని లోమా లిండాలో నివసిస్తున్న శాఖాహారుల ఆహారపు అలవాట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. వాళ్ళు మాంసం తినే వారి కంటే ఎనిమిది సంవత్సరాలు వరకు ఎక్కువ జీవించే అవకాశం ఉంది. మాంసానికి బదులుగా వాళ్ళు టోఫుని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. అప్పుడప్పుడు చేపలు..బ్లూ జోనర్ వాళ్ళు చేపలు తింటారు. కానీ అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. శతాధిక వృద్ధులు వారానికి మూడు చిన్న సేర్విన్గ్స్ చేపలు తింటే సరిపోతుంది.

సార్డినెస్ వంటి చిన్న చవకైన చేపలు తినేందుకు ఎంచుకుంటారు. ఇవి పాదరసం, ఇతర రసాయనాలకి తక్కువ గురి అవుతాయి. పాల ఉత్పత్తులకి దూరం..బ్లూ జోనర్ వాళ్ళు డైరీ ఉత్పత్తులకి దూరంగా ఉంటారు. ఆవు పాలు రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే వాటికి దూరంగా ఉంటారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మేక, గొర్రె పాల ఉత్పత్తులు ఎంచుకుంటారు. గుడ్లు తినరు..ఎక్కువ కాలం జీవించడానికి గుడ్లు తినాల్సిన అవసరం లేదని అంటారు. ఒకవేళ తినాల్సి వస్తే వారానికి మూడు కంటే ఎక్కువ తీసుకోరు. తృణధాన్యాలు, మొక్కల ఆధారిత వంటకానికి ఒక గుడ్డు జత చేసుకుని తీసుకుంటారు.

గుండె, రక్త ప్రసరణ సమస్యలు, మధుమేహం ఉన్న వాళ్లయితే గుడ్లు పూర్తిగా విస్మరిస్తారు. బీన్స్..కాయధాన్యాలు వంటి బీన్స్ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు. బ్లాక్ బీన్స్, చిక్ పీస్, వైట్ బీన్స్ తీసుకుంటారు. ప్రతిరోజూ కనీసం అరకప్పు వండిన బీన్స్ తినాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా గుండెకి మేలు చేసే ఆహారాలలో ఒకటి ఇవి. చక్కెర తగ్గించాలి..చక్కెరని పూర్తిగా పక్కన పెట్టేయరు. ప్రతిరోజూ ఏడు టీ స్పూన్ల చక్కెర కంటే ఎక్కువ తినకూడదని అనుకుంటారు. ప్రత్యేక సందర్భాలలో స్వీట్లు, కుకీలు, కేక్ లు ఇష్టంగా తీసుకుంటారు.

నట్స్..చిరుతిండిగా ఆరోగ్యకరమైన నాట్స్ ఎంచుకుంటారు. బాదం, వేరుశెనగ, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, వాల్ నట్స్ తింటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకి గరిష్టంగా రెండు చిన్న గుప్పెళ్ళ నట్స్ తీసుకుంటారు. బ్రెడ్ ముట్టుకోరు..ప్రాసెస్ చేసిన బ్రెడ్ కి చాలా దూరంగా ఉంటారు. తృణధాన్యాలతో చేసిన వాటిని ఎంచుకుంటారు. తెల్ల పిండితో చేసిన రొట్టెలకి దూరంగా ఉంటారు. ఇవి త్వరగా చక్కెరగా మారి ఇన్సులిన్ స్థాయిలని పెంచుతాయి.

ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు.. షుగర్ ఫ్రీ, తక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడరు. బ్లూ జోనర్ వాసులు విటమిన్లు, సప్లిమెంట్లు కంటే తినే ఆహారం ద్వారానే పోషకాలు పొందటానికి చూస్తారు. ద్రవపదార్థాలు..ఫిజీ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. రోజుకి కనీసం ఏడు గ్లాసుల నీటిని తాగుతారు. రెడ్ వైన్ మితంగా తీసుకుంటారు. ఆకుపచ్చ లేదా రోజ్మేరీ, సేజ్ వంటి టీలు ఎంచుకుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker