Health

20 ఏళ్లు దాటినా ప్రతి అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇదే.

ఒక మగాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు అయినా ఆ అమ్మాయి తక్కువ వయసు కలిగి ఉండాలని పెద్దలు భావించేవారు. ఇప్పుడు 4, 2 ఏళ్లు గ్యాప్ ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. స్త్రీల వయసు మగాళ్ల కంటే తక్కువ ఉండాలన్న సాంప్రదాయంగా వస్తుంది. కాకపోతే ఇదేమీ నియమం ఏమీ కాదు. కానీ ఈ సాంప్రదాయాన్నే ఒక నియమంగా పాటిస్తూ వచ్చారు. కొంతమంది పట్టించుకోకపోవచ్చు. అయితే 20 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రతి ఆడపిల్లా ఏదో ఒక సందర్భంలో వినీ విసుగెత్తిపోయే మాటలివి.

జెండర్ ఇనిక్వాలిటీ మన సంస్కృతిలో భాగమైపోవడంవల్ల నిర్ణయాలు తీసుకోవడంలో, అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తరచూ మహిళలే బాధితులవుతున్నారని కొందరు మానసిక నిపుణులు, ఫెమినిస్టులు చెప్తున్నారు. మహిళల జీవితంలో 20 ఏళ్ల వయస్సు సంతోషకరమైదిగాను, భయంకరమైనదిగాను ఉంటోంది. చదువుకొని స్థిరపడాలన్న ఆలోచన అమ్మాయిలకు ఉన్నా, మరోవైపు అందుకు వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది.

పెళ్లీడు వచ్చిందని, లగ్గం చేసుకోవాలని పేరెంట్స్‌తోపాటు బంధువులు, చుట్టు పక్కలవాళ్లు పదే పదే ప్రస్తావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బయటివాళ్ల ఒత్తిడివల్ల కూడా కుటుంబ సభ్యులు చదువు, ఉద్యోగం, కెరీర్ వంటి అంశాలకంటే ఆడపిల్ల పెళ్లికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అత్తారింటికి పంపిస్తే ఓ బాధ్యత తీరిపోతుందని, రిలాక్స్ అవ్వొచ్చని భావిస్తుంటారు.

ఇక ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే త్వరగా పెళ్లి చేసుకోవాలని పెద్ద కూతురుపై ఒత్తిడి తేవడం ఇప్పటికీ అనేక కుటుంబాల్లో చూస్తుంటాం. ఒక వేళ ఆమెకు ఇష్టం లేకపోతే ‘పెళ్లి కావాల్సిన ఇంకో ఆడ పిల్ల ఇంట్లో ఉంది. నువ్వు చేసుకోనంటే ఎలా?’ అంటూ ప్రశ్నించడం, ఒప్పించడం చేస్తుంటారు. దీంతో ఇప్పటికీ చాలామంది మహిళలు తమ 20 ఏళ్ల వయస్సులో చదువు, భవిష్యత్తు, పెళ్లి అనే విషయాల గురించి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు.

అదే ఒక మగపిల్లవాడి విషయంలో ఇలాంటి పట్టింపులు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉండవు. అందుకు కారణం మన సమాజంలో పాతుకుపోయిన లింగ అసమానత, పురుషాధిక్యత భావజాలమేనని కొందరు కౌన్సెలింగ్ సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, ఆడ పిల్లలు కూడా తమ కాళ్లపై తాము నిలబడే నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితి రావాలని చెప్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker