News

రామమందిర నిర్మాణానికి రూ.52 లక్షలు విరాళం ఇచ్చిన 14 యేళ్ల బాలిక, అ డబ్బు ఎక్కడిదంటే..?

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది పడినప్పుడు రామభక్తులు ఎంత విరాళం ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ వడ్డీ డబ్బుతోనే ఆలయం మొదటి అంతస్తు పూర్తవుతుంది. అయోధ్యలోని రామమందిరానికి విరాళాలు ఇచ్చే రామభక్తులు చాలా మంది ఉన్నారు. అయితే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని తెలుసుకోంది.

అందుకు ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారనే విషయం బాలిక చెవిన పడింది. అంతే.. తానూ ఆలయానికి విరాళం అందించాలని అనుకుంది. అప్పటి నుంచి బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. తాను చదివిన కథలను కొవిడ్‌ ఐసోలేషన్ సెంటర్లు, లాజ్‌పూర్ జైలు, బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది. 2021లో లాజ్‌పూర్ జైలులో ఉన్న దాదాపు 3200 ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.

అలా భవికా తాను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి రాముడి కథలు చెబుతూ 300పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52 లక్షల వరకూ సేకరించింది. తాను సేకరించిన మొత్తం నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చి తన కలను నెరవేర్చుకుంది. ఈ క్రమంలో బాలిక భవికా కేవలం రాముడి గాథను ప్రదర్శించడమే కాకుండా 108కిపైగా వీడియోలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ఆ వీడియోలను దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వీక్షించారు. భావిక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది. దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ముని కలిసి, తాను రాసిన పుస్తకాన్ని బహుకరించింది. ద్రౌపది ముర్ముపై ఆమె రాసిన పుస్తకం పేరు ‘సంఘాష్ సే శిఖర్ తక్’.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker