Health

అబార్షన్‌ తర్వాత ఎలాంటి పనులు చేయాలంటే..? దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు.

ఇటీవల, భారత సుప్రీంకోర్టు ఒక మహిళలు తమ 26 వారాల గర్భాన్ని తొలగించడాన్ని నిరాకరించింది. దీని వల్ల ఆ మహిళ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనే మానసిక స్థితితో బాధపడుతోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, న్యాయవాదులు గర్భస్రావం వైద్య పరిస్థితులను సైతం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. వివిధ పరీక్షలు, అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్ చేయబడుతుంది. కానీ గర్భస్రావం తర్వాత కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయన్న విషయం తెలుసుకోవాలి. ఇది స్త్రీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

నిజానికి, అబార్షన్ తర్వాత, మహిళ శరీరం రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, బలహీనత వంటి అబార్షన్ ప్రమాదాలు, దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అయితే అబార్షన్లు తక్కువ ప్రమాదకరమైన వైద్యవిధానాలుగా పరిగణిస్తారు. అయినప్పటికీ, తీవ్ర రక్తస్రావం, తిమ్మిర్లు వంటి దుష్ప్రభావాలు ఇబ్బంది పెడుతుంటాయి. అబార్షన్‌ చేయించుకున్న అనంతరం ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు చెప్తుంటారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అబార్షన్‌ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఎవరైనా ఫిట్‌గా ఉన్నట్లయితే మరుసటి రోజు నుంచే యధావిధిగా పనుల్లో చేరవచ్చు.

అయితే, మొదట కొన్ని రోజులు నొప్పిని కలిగించే పనులకు దూరంగా ఉండాలి. తిమ్మిర్లు సాధారణంగా 3-5 రోజులపాటు కనిపిస్తాయి. మెడికల్‌ అబార్షన్‌లో నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లను తగ్గించుకునేందుకు వైద్యుల సూచనలతో మందులు వాడాలి. హీటింగ్ ప్యాడ్‌ లేదా వేడి నీటి బాటిల్‌ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే లోతైన శ్వాస తీసుకుంటూ మొల్లగా వదలడం చేయాలి. తుంటి, వీపు, పొట్ట భాగంలో నూనెతో మసాజ్‌ చేయించుకోవాలి. అలాగే, కొన్నిరోజుల పాటు అనారోగ్యంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇతర దుష్ప్రభావాలు..ఛాతీ, రొమ్ముల భాగంలో నొప్పి కనిపిస్తుంది. మ్యూకస్‌ మాదిరి డిశ్చార్జీ ఎక్కువగా ఉంటుంది.

వికారం, వాంతులు, అతిసారం జరుగుతుంది. కొంత మందిలో చలి, వణుకు కనపడుతుంది. నిద్రపోతున్న భావనలో ఉంటారు. తక్కువ పనికే శక్తిని కోల్పోతుంటారు. త్వరగా అలసిపోతుంటారు. ఎప్పుడు వైద్యుడ్ని సంప్రదించాలి..అధిక రక్తస్రావం జరుగుతున్న సందర్భాలు, రక్తం గడ్డలు నిమ్మకాయ కంటే పెద్దదిగా ఉన్నప్పుడు, రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగే గర్భధారణ సంకేతాలు, మూర్చ వచ్చిన సందర్భాలు, ఛాతీలో అసౌకర్యంగా కనిపించడం, తీసుకోవడంలో ఇబ్బంది, ఇన్ఫెక్షణ్‌తో జ్వరం వచ్చినప్పుడు, చీము లాంటి డిశ్చార్జీ జరుగుతున్నప్పుడు, వెన్ను నొప్పి లేదా కడుపు నొప్పి కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.

గర్భస్రావం తర్వాత ఉద్యోగులు విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేని వారు తమ హెచ్‌ఆర్‌ విభాగాల్లో మాట్లాడి సెలవు తీసుకోండి. కార్యాలయ వాతావరణాన్ని ఫేస్‌ చేసేందుకు సిద్ధంగా లేనప్పుడు వర్క్‌ఫ్రం హోం చేసేందుకు అనుమతి కోరండి. మీ సమస్యను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యులతో పంచుకోవడం అలవర్చుకోవాలి. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేలా తయారవ్వాలి. ఆఫీసుకు వెళ్లాల్స వస్తే పనులతో బిజీగా ఉండేలా చూసుకోవాలి. విరామ సమయాన్ని ధ్యానం చేసేందుకు వినియోగించుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker