News

సుప్పిని సుద్దపూసని అని అడ్డంగా బుక్కన నటి హేమ. ఆ ఒక్క వీడియో ఆమె కష్టాలు రెట్టింపు.

హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా 150 మంది హాజరయ్యారని తెలిపారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు ఫిర్యాదు చేశారు. అయితే హేమ అండ్ కరాటే కల్యాణి… టాలీవుడ్‌లో ఇద్దరికిద్దరూ ఫైర్‌బ్రాండ్లే.. ఒకరంటే ఒకరికి మంట.

గతంలో మాటామాటా అనుకుని చూపరులకు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన జంట. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి.. ఒకర్నొకరు ఏకిపారేసుకున్న కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాకులు వీళ్లవి. ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఎదురుపడ్డారు.. పాత పగలు పెచ్చరిల్లి.. ప్రతీకార జ్వాలను రగిలించేలా ఉన్నారు. ఎందుకంటే ఈ పగ ఇప్పటిది కాదు. పేకాట ఆడి దొరికానని అప్పట్లో నన్ను బజారుకీడ్చింది.. ఇప్పుడు ఆమె అంతకంటే పెద్ద తప్పే చేసి నంగనాచిలా నాటకాలాడుతోంది.. అంటూ తనకు తానే గతాన్ని గుర్తు చేసుకుంటోంది కరాటే కల్యాణి.

సో.. రేవ్‌పార్టీ సాకు మీద ఇద్దరి మధ్యా మళ్లీ చాకిరేవ్ షురూ ఐనట్టేనా? నిజం నిప్పులాంటిది, బయటపడక తప్పదు.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు రిపోర్టు వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్న కళ్యాణి.. హేమకు అదే పనిగా కాపడం పెడుతున్నారు. యూట్యూబ్ చానెళ్ల గొట్టాలకిచ్చిన ఇంటర్వ్యూల్లో హేమాయణాన్ని కథలు కథలుగా చెబుతోంది కరాటే కల్యాణి. ఒక్క వీడియోతో జనాన్ని, పోలీసుల్ని, మీడియాను కంబైన్డ్‌గా తప్పుదారి పట్టించినందుకు రేపటిరోజున హేమ బహిరంగ క్షమాపణ చెబితే చెప్పొచ్చు గాక.

కానీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున హేమకు శిక్ష తప్పదని చెబుతోంది మా జాయింట్ సెక్రటరీ హోదాలో కరాటే కల్యాణి. ఇలా రేవ్‌పార్టీలు, డ్రగ్‌ రాకెట్ల లాంటి ముతక సందర్భాల్లో తీగలాగితే టాలీవుడ్ డొంక మాత్రమే ఎందుకు కదులుతోంది? టాలీవుడ్ సెలబ్రిటీలు చిల్ అవడానికి.. గలీజు దారుల్లో వెళుతున్నారా? ఇటీవల అనేక సందర్భాల్లో మాదకద్రవ్యం అనగానే ఆ పక్కనే నవదీప్ పేరు టక్కున వినిపిస్తోంది. ఇప్పుడీ రేవ్ పార్టీలో హేమ అంటూ తాజా ఉదంతం.

ఇలా.. ఒకరిద్దరు చేసే ఓవరాక్షన్ల వల్ల.. కళంకం మాత్రం పరిశ్రమ మొత్తానికీ అంటుకుంటోంది. అందుకే.. అడ్డదారి తొక్కినవాళ్లు ఎవరైనా సరే ఆడ, మగ తేడా లేకుండా.. కఠిన శిక్షలు పడాల్సిన అవసరమైతే ఉంది. కోలీవుడ్‌లో ఐతే ఇటువంటి సందర్భాల్లో నటీనటుల సంఘం నుంచి పీకిపారేస్తారు.. ఏళ్ల తరబడి సినిమాల్లో నటించకుండా బహిష్కరిస్తారు. అలా దండన గట్టిగా ఉంటే తప్ప.. దారికి రారు అనే సలహాలు వినిపిస్తున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker