దేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు, వెలుగులోకి షాకింగ్ నిజాలు.
వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే స్త్రీ.. రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తుంటుంది. అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణం. వివాహానికి ముందు ఉండే వివాహేతర సంబంధాలు కూడా వివాహం తర్వాత కొనసాగించాలన్న మనస్సులో కోర్కె కలుగడం. అయితే భారతదేశంలో వివాహం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత, మరొకరితో ఉండటం చట్ట ప్రకారం నేరు. అయితే భారతీయ వివాహ వ్యవస్థ గురించిన ఓ షాకింగ్ వాస్తవం వెల్లడైంది. ఇటీవల కాలంలో వివాహేతర డేటింగ్.. జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలోని వివాహిత పౌరులు ఇప్పుడు డేటింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ఈ సర్వేలో తేలింది. గ్లిడెన్ వివాహం.. మోసం మరియు సాంస్కృతిక నిబంధనల పట్ల భారతదేశం యొక్క మారుతున్న వైఖరిని అధ్యయనం చేసింది.
ఈ అధ్యయనంలో టైర్ 1, టైర్ 2 నగరాల నుండి 25 నుండి 50 సంవత్సరాల వయస్సు గల 1503 మంది వివాహిత భారతీయులు పాల్గొన్నారు. గ్లిడెన్ యొక్క అధ్యయనంలో.. పాల్గొన్న వారిలో 60 శాతం కంటే ఎక్కువ మంది స్వింగ్ వంటి సాంప్రదాయేతర డేటింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. వివాహం అనంతరం భాగస్వామిని మోసం చేయడానికి ఉపయోగించే అనేక పద్ధతులను ప్రస్తుతం మన దేశంలో కొందరు అవలంభిస్తున్నారంట. మరొక వ్యక్తితో శారీరక సంబంధాలను కలిగి ఉండటానికే ఇలా చేస్తున్నారు.
వివాహితుడు మరొక వ్యక్తితో మానసికంగా అనుబంధం కలిగి ఉంటే, అది మోసమనే చెప్పాలి. 46 శాతం మంది పురుషులు అలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మంది కోల్‌కతాకి చెందిన పురుషులు ఉన్నారంట. ఇక ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రిలేషన్ షిప్ చీటింగ్‌లో ఒక భాగం అయిపోయింది. ఈ అధ్యయనం ప్రకారం 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్ ఫ్లర్టింగ్‌ను ఇష్టపడుతున్నారంట.
కొచ్చిలో అధిక శాతం మంది డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారంట. అంతేకాదు ఈ అధ్యయనం ప్రకారం దేశంలో 33 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఇతరులతో కలిసి ఉండాలనే ఫాంటసీని జీవిస్తున్నారంట. వారు ఇతరులతో శారీరక బంధం ఏర్పరుచుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారంట.