Health

పెళ్లి తర్వాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతురో తెలుసా..?

పెళ్లికి ముందు ఆడపిల్లలు డైట్, వ్యాయామం చేస్తూ బరువుని కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఎందుకంటే తనకు కాబోయే భర్తకు నచ్చాలని ఆరాటపడుతారు. కానీ వివాహం అయిన వెంటనే వారు తమ డైట్‌ని వదిలిపెడుతారు. రిలాక్స్ అవుతారు. ఇన్ని రోజులు చేసిన డైట్‌ ఒక్కసారిగా వదిలివేయడంతో ఆ ఎఫెక్ట్‌ శరీరంపై పడుతుంది. దీంతో బరువు పెరుగుతారు. అయితే పెళ్లైన కొత్తలో దంపతులు హ్యాపీగా ఉంటారు. జీవితంలో మార్పులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో బరువు కూడా పెరుగుతుంటారు. చాలామంది ఇదే విషయం చెబుతారు. పెళ్లైతే.. బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే వివాహం అయిన తర్వాత జంటలు బరువు ఎందుకు పెరుగుతారు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట.

కొత్తగా పెళ్లైన వారు.. ఒకరితో ఒకరు ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఇద్దరూ కలిసే తింటారు. అయితే ఇందులో ఒకరు ఆహార ప్రియులు అయినా.. మరొకరికి ఆహారం మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా.. ఒకరు తింటుంటే.. మరొకరు కూడా తింటుంటారు. దీంతో ఆహారం ఎక్కువ తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా వివాహం తర్వాత బరువు పెరిగేందుకు ఓ కారణంగా చెబుతారు. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఎంతోకొంత ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెడతారు. ఎక్కువ వ్యాయామం చేస్తారు. నడుస్తారు. యోగా చేస్తారు. పెళ్లి రోజున సూపర్ గా కనిపించొచ్చు. కానీ పెళ్లైన తర్వాత.. మీ కోసం మీరు సమయాన్ని కేటాయించలేరు. వివాహ సమయంలో, మనకు అనేక ఆచారాలు ఉంటాయి.

నెయ్యి, నూనె, పంచదార ఎక్కువగా ఉపయోగించే.. వంటకాలు తయారు చేస్తారు. ఇవన్నీ కొవ్వును పెంచేవే. కచ్చితంగా అవి తినాల్సి వస్తుంది. ఇది కూడా బరువు పెరిగేందుకు ఓ కారణమే. పెళ్లయిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కొత్తగా పెళ్లయిన జంటను తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఈ సమయంలో, లంచ్ లేదా డిన్నర్‌లో తినే ఆహారంలో కూడా కొవ్వు అధికంగా ఉంటుంది. దీని తరువాత, ఎక్కువసేపు కూర్చొంటారు. దీంతో నడవడం అసాధ్యం. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. పెళ్లి షాపింగ్ నుంచి.. పెళ్లి కార్యక్రమాల వరకూ.. కొత్త జంటలు చాలా అలసిపోతారు. కొన్నిసార్లు సంగీత్ వేడుకలు, మెహందీ, ఇతర ఆచారాల కారణంగా చాలా రాత్రి అయినా నిద్రపోరు.

సరైన నిద్రలేకపోవడం కూడా.. బరువు పెరిగేందుకు కారణం కావొచ్చు. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ సమయంలో కూడా ప్రయాణం, హోటల్, రెస్టారెంట్ ఫుడ్ వల్ల హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇవన్నీ శరీర బరువు వేగంగా పెరగడానికి కారణాలుగా అవుతాయి. పెళ్లి తర్వాత చాలా మంది వధువులు ఊబకాయం సమస్యను ఎదుర్కోవడానికి ఇవి సాధారణ కారణాలు. పెళ్లి తర్వాత.. మహిళలు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. ఆహారంలో మార్పు వస్తుంది. వారు అంతవరకు తమ పుట్టింట్లో తినేదానికి భిన్నంగా తినాల్సి ఉంటుంది. తమ ఇష్టానుసారం కాకుండా భర్త, అత్తమామల ఎంపిక ప్రకారం ఆహారంలో మార్పు చేసుకోవాల్సి వస్తుంది.

వంట చేసేటపుడు అందరి మెప్పు పొందడం కోసం రుచికరంగా వంట చేసేందుకు నూనె, నెయ్యి, మసాలాలు ఎక్కువగా వాడతారు. అలాగే ఆహారం వృథాగా పోకూడదు. ఈ క్రమంలో ఎక్కువ తినాల్సి రావచ్చు. ఆహారం విషయంలో మారిన ఈ ప్రాధాన్యతలు ఆడవారి బరువు పెరగడానికి కారణం అవుతుంది. పెళ్లి అయిన తర్వాత శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ ఉండకపోవచ్చు. అదే సమయంలో ఉపవాస దీక్షలు, పూజలు, వ్రతాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి బంధువుల నుంచి ఆహ్వానాలు ఎక్కువ అవుతాయి, ప్రయాణాలు ఎక్కువవుతాయి. విందులు, వినోదాలు పెరుగుతాయి. ఇవన్నీ బరువును పెరిగేందుకు కారణాలు అవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker