Health

ప్రతి ఒక్కరు ఆ పని చేసిన తర్వాత టాయిలెట్ కచ్చితంగా వెళ్లాలి. ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా మాట్లాడటంతో అమ్మాయిలు హస్త ప్రయోగం గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నారు. హస్తప్రయోగం గురించి ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. స్వీయ ఆనందం కోసం లైంగిక ప్రేరణతో మీకు మీరు చేసుకునే పనే హస్తప్రయోగం అంటారు. అయితే హస్తప్రయోగం అనేది సెక్స్ గురించి.. ఆలోచిస్తూ.. తమను తాము ప్రేరేపించుకునేందుకు చేసే చర్యలో ఒకటి. చాలా మంది ఇది చేస్తుంటారు. హస్తప్రయోగం నేరం కాదు, కానీ చాలా అలవాటుగా చేస్తే.. మాత్రం మంచిదికాదు.

అటువంటి పరిస్థితిలో హస్తప్రయోగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు, యుటిఐ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. దీన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. సెక్స్ తర్వాత టాయిలెట్‌కి వెళ్లాలని చాలా మందికి తెలుసు. ఇది మూత్ర నాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. అయితే హస్తప్రయోగం తర్వాత మూత్ర విసర్జన గురించి చాలా మందికి తెలియదు. హస్తప్రయోగం తర్వాత టాయిలెట్‌కి వెళ్లి శుభ్రం చేసుకోవాలి.

మీ అరచేతులు, వేళ్లు, సెక్స్ టాయ్‌లు, లోదుస్తుల ద్వారా జననేంద్రియాలతో సంబంధంలోకి వచ్చే బ్యాక్టీరియా UTI రిస్క్‌కి కారణమవుతుంది. హస్తప్రయోగం చేసిన తర్వాత కూడా టాయిలెట్ వెళ్లాలి. హస్తప్రయోగానికి ముందు, తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యం. మురికి చేతులు మీ ప్రైవేట్ పార్ట్ పరిశుభ్రతను పాడు చేస్తుంది. వ్యాధి సంక్రమణ అవకాశాలను పెంచుతాయి. బాక్టీరియా మీ చేతులు, గోళ్ళలో ఉండొచ్చు.

దీనిద్వారా సమస్యలు రావొచ్చు. లక్షలాది బ్యాక్టీరియా గోళ్లలో నివసిస్తుంది. మీరు యోని హస్తప్రయోగం చేస్తుంటే, గోర్లు జననేంద్రియాల్లోకి వెళ్తాయి. ఇది పరిశుభ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. లేనిపోని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గోళ్లు చిన్నగా ఉండాలి. శుభ్రంగా చూసుకోవాలి. జననేంద్రియ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీరు క్రమం తప్పకుండా ఉతికిన, శుభ్రమైన లోదుస్తులను ధరించడం చాలా ముఖ్యం.

ఇలా చేయడం ద్వారా మీరు మీ ప్రైవేట్ భాగాల pH స్థాయిని ఉన్నత స్థాయిలో నిర్వహించవచ్చు. సెక్స్ టాయ్‌ని ఉపయోగిస్తుంటే, దాని శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించండి. సెక్స్‌టాయ్‌ను ఉపయోగించే ముందు, తర్వాత పూర్తిగా శుభ్రం చేయండి. హానికరమైన బ్యాక్టీరియా దానిపై వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది UTI సంక్రమణకు దారితీస్తుంది. అందుకే హస్తప్రయోగం చేసినా.. శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker