Health

ఈ గాలి పిలిస్తే మీకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు కూడా..?

ఈ వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. వాహన ఎగ్సాస్ట్ పొగలు, కర్మాగారాలు, పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే పొగలు, కాలుష్యం పొగత్రాగడం వల్ల వచ్చే నష్టాలకంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారయ్యాయని తెలిపారు. ధూపపానం కంటే వాయుకాలుష్యం బారిన పడి చాలా మంది మరణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే గాలి కాలుష్యం పెరిగిపోతోంది. వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడం, పరిశ్రమల సంఖ్య పెరగడం వల్ల గాలి, నీరూ రెండూ… కలుషితంగా మారాయి. అలాంటి గాలిని పీల్చుకోవడం వల్ల మానవ శరీరాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

గాలి కాలుష్యం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం పెరిగిపోతోంది. నిజానికి పక్షవాతం రావడానికి ఊబకాయం, పోషకాహారం తినకపోవడం, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి కారణాలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు వీటితో పాటూ గాలి కాలుష్యం కూడా కారణంగానే చెప్పుకోవాలి. గాలి కాలుష్యం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశం 30 శాతం పెరిగినట్టు చెబుతోంది కొత్త అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ పరిశోధకులు గాలి కాలుష్యానికి, పక్షవాతానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చేసిన దాదాపు వంద అధ్యయనాల ఫలితాలను వీరు పరిశీలించారు. ఆ పరిశోధన ఆధారంగా గాలి కాలుష్యం మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు ధ్రువీకరించారు. గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, కళ్లు దెబ్బతింటాయని చాలా మందికి తెలుసు. కానీ గాలిలోని కాలుష్యం మెదడును కూడా దెబ్బతీస్తుంది. గుండె, రక్త నాళాల వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల మనిషి శరీరం మరింతగా అనారోగ్యం పాలవుతుంది.

పీల్చిన కలుషిత గాలిలోని రసాయనాలను బట్టి పక్షవాతం వచ్చే ముప్పు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. పీల్చిన గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే పక్షవాతం వచ్చే ముప్పు 30 శాతం పెరుగుతుంది. అదే పీల్చే గాలిలో కార్భన్ మోనాక్సైడ్ అధికంగా ఉంటే 26 శాతం పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. అలాగే సల్భర్ డైయాక్సైడ్ ఉన్న గాలిని అధికంగా పీలిస్తే 15 శాతం పక్షవాతం వచ్చే ముప్పు ఉంది. పక్షవాతం మరణించే ముప్పు సల్ఫర్ డైయాక్సైడ్ తో వల్ల 60 శాతం అధికం.

అదే నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల 33 శాతం అధికం. గాలిలో ఉండే నుసి లాంటి నల్లని పదార్థాన్ని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. దీనిల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి పక్షవాతం వచ్చే అవకాశం పెరిగిపోతుంది. గాలి కాలుష్యం వల్ల కేవలం పక్షవాతమే కాదు, అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గాలి కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పరిశ్రమలకు దగ్గరగా ఉండే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker