Health

రోజు మందు తాగేవారు ఒక్కసారిగా మానేస్తే ఏమౌతుందో తెలుసా..?

కొంతమంది ప్రతి రోజూ తాగుతారు. అది కూడా పరిమితి లేకుండా. ఇలాంటి వాళ్లకు భవిష్యత్తులో గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మరికొంత మంది కొన్నాళ్లు మానేస్తారు. తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. ఇది కూడా డేంజరే. అయితే మందును తాగడం వల్ల కాలేయం మాత్రమే దెబ్బతింటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆల్కహాల్ వినియోగం ప్రత్యక్షంగా, పరోక్షంగా కాలేయం, గుండె, మెదడుతో సహా అన్ని అంతర్గత అవయవాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

అందుకే ఈ అలవాటును మానేయడమే మంచిది. అయితే బరువు తగ్గడం.. మందు మానేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు. అయితే మీరు మంచి మార్గంలోనే బరువు తగ్గుతారు. దీనికి బయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఆల్కహాల్ ఉన్న పానీయాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తాగడం వల్ల మీరు బరువు పెరుగుతారు. రెగ్యులర్ గా తాగేవారికి పొట్ట ఉంటుంది మీరు గమనించారో లేదో.. మెరుగైన నిద్ర.. మందు తాగితే బాగా నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటుంటారు.

కానీ దీనిలో ఇంత కూడా నిజం లేదు. మీరు తాగినప్పుడు మీకు సరిగ్గా నిద్ర రాదు. కేవలం ఒక గంట మాత్రమే మీరు బాగా పడుకుంటారు. ఆ తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు. ఇది చివరికి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ మందును మానేసినప్పుడు మీరు కంటినిండా నిద్రపోతారు. దీంతో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు.. మందును మానేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ గా తాగేవారు జ్ఞాపకశక్తిని కోల్పోతారు.

అలాగే ఏకాగ్రత కూడా లోపిస్తుంది. మందును మానేయడం ద్వారా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం..ఆల్కహాల్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అందుకే తాగడం మానేసినప్పుడు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆల్కహాల్ కాలేయంతో సమస్యలను కలిగిస్తుంది, ఇది ప్రధానంగా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.

కాలేయం ఆరోగ్యం..మందు తాగడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవాలలో కాలెయం ఒకటి. మీరు దీన్ని మానేసినప్పుడు కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. సురక్షితంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. మందును మానేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker