News

అల్లు అర్జున్ పనిమనిషి కోసం ఎం చేసాడో చూడండి. దీంతో భారీగా పెరిగిన పనిమనిషి ఫాలోయింగ్.

ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అశేష ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా దెబ్బకి నార్త్ ఇండియాలో కూడా బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. తాజాగా బన్నీ తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన ఫ్యాన్‌తో ఫన్నీగా మాట్లాడాడు బన్నీ. తన ఇంట్లో పని చేసే పని మనిషికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా బ‌న్నీ సాయం చేయ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ ఇంట్లో పని మనిషి. ఆమె పేరు అశ్విని. ఈమె గురించి అందరికీ తెలియకపోయినా బన్నీ ఇంటికి వెళ్లే వారికి మాత్రం అశ్విని గురించి తెలిసే ఉంటుంది. అల్లు అర్జున్ కుమారుడు అయాన్, కూతురు అర్హలను ఈమె చూసుకుంటుంది. చాలా వీడియోల్లో కనిపించిన అశ్విని కోసం బన్నీ సైతం ఇన్ స్టాలో ఓ వీడియో చేశారు.

అందులో తనకు ఎంతమంది ఫాలోవర్స్ కావాలి అంటే 30 వేల మంది ఫాలోవర్స్ కావాలని అశ్విని అడుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇన్ స్టాలో ఏకంగా లక్షా 33 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి కొద్ది రోజుల్లోనే అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ చేసిన వీడియోతో అశ్విని ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా మారిపోయిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

తాజాగా మెగా ఫ్యామిలీ బెంగళూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు అల్లు ఫ్యామిలీతో అశ్విని కూడా వెళ్లింది. అక్కడ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అరవింద్, శ్రీజలతో దిగిన ఫొటోలను అశ్విని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు అశ్వినిని స్టార్ పని మనిషి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker