Health

ఆలూ చిప్స్ ఎక్కువగా తింటున్నారా..! అయితే మీ పని ఔట్‌. ఎలానో తెలుసుకోండి.

ఆలు చిప్స్ తింటుంటే తినాలనిపించే పుడ్‌.. ఒకటి, రెండు తిని వదలం ప్యాకెట్ మొత్తం లాగించేస్తాం కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక అధ్యయనంలో చిప్స్ ఎక్కువగా తినేవారు తొందరగా చనిపోతారట. పిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కొవ్వుతో ఉండే ఆలూ చిప్స్ త్వరగా జీర్ణం కావు. అందుకే కడుపునొప్పి లాంటి సమస్యలు ఏర్పడతాయి.

అయితే బంగాళదుంప చిప్స్ పలుచగా ఉంటాయి. తేలికగా ఉంటాయి. అయితే ఎక్కువగా తీసుకున్నా ఏం అవ్వదని చాలామంది భావించి అదేపనిగా తింటూ ఉంటారు. కానీ పొటాటో చిప్స్ ని ఎక్కువగా తినడం వలన అందులో ఉప్పు, నూనె ఎక్కువ ఉంటాయి. ఇవి బీపీని పెంచుతాయి. రక్త పోటు స్థాయిలు పెరిగితే పలు రకాల సమస్యలు కలుగుతుంటాయి. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉంటుంది.

అధిక రక్తపోటుకి బంగాళదుంప చిప్స్ దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఇది మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలో సోడియం లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. కాబట్టి లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. పొటాటో చిప్స్ ని ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంటుంది. క్యాన్సర్ బారిన పడి అనవసరంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాలి.

గుండె ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. బంగాళదుంప చిప్స్ ని తీసుకోవడం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ బాగా పెరిగినట్లు స్టడీ చెప్తోంది. బంగాళదుంప చిప్స్ ఎక్కువ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ బంగాళాదుంపల చిప్స్ ని తీసుకోవడం వలన బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

స్టడీ ద్వారా ట్రాన్స్ ఫ్యాట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా ప్రశాంతంగా కూడా ఉండలేరట. ఇలా బంగాళదుంప చిప్స్ వలన ఇన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker