ఈ రసం తాగితే సిరలలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.

కలబంద రసం తాగడం వల్ల అనేక వ్యాధులకు మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ , విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 మరియు విటమిన్ బి12 ఉంటాయి. సోడియం, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు కలబందలో ఉంటాయి. అయితే జీవనశైలి మారడంతో నేటి రోజుల్లో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి.
ముఖ్యంగా చిన్నవయసులోనే గుండెపోటు వచ్చి చాలామంది మరణిస్తున్నారు. కొలస్ట్రాల్ ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ఇది కంట్రోల్‌లో ఉండకపోతే చాలా ప్రమాదం. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో ఒకటి కలబంద రసం. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి మాత్రేమే కాదు కొలస్ట్రాల్‌ని తొలగించడానికి కూడా పనిచేస్తుంది. రోజూ కలబంద రసం.. కలబంద ఆయుర్వేదంలో రారాజుగా చెప్పవచ్చు.
ఎందుకంటే ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అనేక రకాల ప్యాక్డ్ కలబంద మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఇంట్లో పెంచే కలబంద తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే తాజా వస్తువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. రోజులో కనీసం ఒక గ్లాసు కలబంద రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు తగ్గుతాయి. దీన్ని తాగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భారతదేశంలో చాలా మంది ప్రజలు ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా కడుపు సమస్యలు మొదలవుతాయి. ఇందులో అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ వంటివి ఉంటాయి. వీటివల్ల వాష్‌రూమ్‌లో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కలబంద రసం తాగాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కలబంద రసం చర్మానికి ఉత్తమమైన ఆయుర్వేద ఔషధం. దీనిని చాలా బ్యూటీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది.